Indian Railways: సీనియర్ సిటిజన్ల టికెట్లపై రాయితీ రద్దు.. రైల్వేకు రూ.2,242 కోట్ల అదనపు ఆదాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways: రైల్వేశాఖ తీసుకున్న ఓ నిర్ణయం గత ఆర్థిక సంవత్సరంలో వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టింది.. సీనియర్ సిటిజన్ల టికెట్లపై రాయితీని రద్దు చేయడం ద్వారా రైల్వే శాఖకు అదనపు ఆదాయం సమకూరింది. రాయితీ రద్దు మూలంగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,242 కోట్లు అదనంగా ఆర్జించినట్లు రైల్వే శాఖ పేర్కొంది.. ఆర్టీఐ దరఖాస్తుకు జవాబిస్తూ రైల్వే శాఖ అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.. అయితే, కరోనా మహమ్మారీ ఎంట్రీ తర్వాత.. దేశంలో పరిస్థితి మారిపోయింది.. వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ ప్రభావం రవాణా వ్యవస్థపై పడింది.. అదే సమయంలో రైల్వే శాఖ వృద్ధులకు ఇచ్చే టికెట్ రాయితీని ఎత్తేసింది. గతంలో రాయితీలో భాగంగా 60 ఏళ్లు పైబడిన పురుషులకు టికెట్ ధరలో 40 శాతం, 58 ఏళ్లు పైబడిన మహిళలకు టికెట్ ధరపై 50 శాతం మినహాయింపు కల్పించింది.
Read Also: Hyderabad Biryani : బిర్యానీలో బొద్దింక.. రూ.20 వేలు ఫైన్
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
ఇక, లాక్డౌన్ సమయంలో ఎత్తివేసిన రాయితీని ఇప్పటి వరకూ పునరుద్ధరించలేదు రైల్వే శాఖ.. అదే ఇప్పుడు రైల్వేకు భారీ మొత్తంలో అదనపు ఆదాయం సమకూర్చుతోందని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.. సీనియర్ సిటిజన్లకు అమ్మిన టికెట్లతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.5,062 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే శాఖ పేర్కొంది.. ఇందులో సీనియర్ సిటిజన్లయిన పురుషుల నుంచి రూ.2,891 కోట్లు, మహిళల నుంచి రూ.2,169 కోట్లు, ట్రాన్స్ జెండర్ల నుంచి రూ.1.03 కోట్లు వచ్చాయని.. మొత్తంగా టికెట్లపై రాయితీ రద్దుతో రైల్వేకు రూ.2,242 కోట్ల అదనపు ఆదాయం వచ్చినట్టు తెలిపారు.. అయితే, సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించాలంటూ వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.. దీనిపై సుప్రీంకోర్టు వరకు వెళ్లింది వ్యవహారం.. కానీ, ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. కొట్టివేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!