NTV Telugu Site icon

Railway Stocks: ఢిల్లీ నుంచి యూరప్‌కు ఆర్థిక కారిడార్ ఒప్పందం… రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్లిన రైల్వే స్టాక్స్

Railway Stocks

Railway Stocks

Railway Stocks: జీ20 సమావేశం ముగిసిన తర్వాత సెప్టెంబర్ 11 భారతీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభమైనప్పుడు, రైల్వే సంబంధిత స్టాక్‌లలో అద్భుతమైన పెరుగుదల కనిపించింది. ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఐఆర్‌ఎఫ్‌సి స్టాక్‌లతో సహా రైల్వేలకు సంబంధించిన అనేక స్టాక్‌లలో బూమ్ కనిపించింది. సెప్టెంబర్ 9న భారతదేశం నుండి మధ్యప్రాచ్యం ద్వారా యూరప్‌కు ఎకనామిక్ కారిడార్ కోసం ఒక ఒప్పందం కోసం సంతకం చేయబడింది. దీనిలో భారతదేశం నేరుగా రైలు, పోర్ట్ కనెక్టివిటీ ద్వారా యూరప్‌కు అనుసంధానించబడుతుంది. ఈ ఒప్పందం కారణంగా రైల్వే స్టాక్స్ రాకెట్ లాగా పెరిగాయి.

సెప్టెంబర్ IRCON ఇంటర్నేషనల్ స్టాక్‌లో అతిపెద్ద పెరుగుదల స్టాక్ మార్కెట్లో కనిపించింది. 20 శాతం పెరిగిన తర్వాత IRCON ఇంటర్నేషనల్ షేర్ 160.35 రూపాయలకు చేరుకుంది. ఆ తర్వాత స్టాక్ అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. IRCON షేర్లు ఒక వారంలో 25 శాతం, ఒక నెలలో 55 శాతం, 3 నెలల్లో 92 శాతం పెరిగాయి. IRFC స్టాక్ కూడా 10 శాతం పెరిగిన తర్వాత అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. IRFAC రూ. 84.75 వద్ద ఉంది. IRFAC షేర్లు ఒక వారంలో 27 శాతం, ఒక నెలలో 73 శాతంచ, 3 నెలల్లో 155 శాతం పెరిగాయి.

Read Also:Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్‌.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు!

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) స్టాక్ 16.36 శాతం జంప్‌తో రూ. 189.50 వద్ద ముగిసింది. ఇది లైఫ్ టైం హయ్యస్ట్. ఈ షేరు వారంలో 23 శాతం, నెలలో 50 శాతం, 6 నెలల్లో 185 శాతం పెరిగింది. రైల్‌టెల్ కార్ప్ స్టాక్‌లో 5.95 శాతం, టెక్స్‌మాకో రైల్‌లో 4.17 శాతం, రైట్స్ స్టాక్‌లో 3.54 శాతం, కంటైనర్ కార్పొరేషన్ స్టాక్‌లో 3.62 శాతం పెరిగింది.

భారతదేశం నుండి యూరప్ వరకు నిర్మిస్తున్న ఈ ఆర్థిక కారిడార్‌లో భారతదేశంతో పాటు, అమెరికా (యునైటెడ్ స్టేట్స్), సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, యూరోపియన్ యూనియన్ భాగస్వాములు. ఈ కారిడార్ చైనా (బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్)కు గట్టి సవాలును అందిస్తుంది. భారతదేశం, యూరప్ మధ్య వాణిజ్యం సులభతరం అవుతుంది దాంతో పాటు సమయం ఆదా అవుతుంది. అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయనున్నారు. ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును సిద్ధం చేయడంలో భారతీయ రైల్వే కంపెనీలు పెద్ద పాత్ర పోషిస్తాయి. దీని కారణంగా ఈ స్టాక్‌లలో పెరుగుదల ఉంది.
Read Also: