NTV Telugu Site icon

Momos: మోమోస్ తయారీలో కుక్క మాంసం!.. వీడియో వైరల్

Mohali

Mohali

చాలా మందికి.. ఇంట్లో చేసినవి కంటే.. బయట ఆహారాల మీదనే ఇంట్రస్ట్‌ ఉంటుంది. అవే రుచిగా ఉంటాయి కదా..! కానీ వాటిని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? మేకింగ్‌ ఎందుకు ఈటింగ్‌ మాత్రమే మాకు కావాలి అంటారా? ఈ వార్త వింటే చూసిన తర్వాత బయట ఫుడ్‌పై మీరు విసుగుచెందుతారు. వాస్తవానికి.. పంజాబ్‌ రాష్ట్రం మొహాలీ జిల్లా మాటౌర్ గ్రామంలో అక్రమ మోమో, స్ప్రింగ్ రోల్ తయారీ యూనిట్‌పై మున్సిపల్ కార్పొరేషన్ వైద్య బృందం దాడిలు జరిపింది. అధికారులు రిఫ్రిజిరేటర్ లోపల తెగిపోయిన కుక్క తలను కనుగొన్నారు. అంతే కాకుండా నిర్వ చేసిన మీట్‌కుతో పాటు కుళ్లిపోయిన కూరగాయలు గుర్తించారు. వాళ్లు మోమోస్ తయారు చేసే యూనిట్ మొత్తం అపరిశుభ్రంగా ఉంది. ఆ ప్రదేశాన్ని చూసిన అధికారులు కంగుతిన్నారు. ఫ్రీజ్‌లో నిల్వ ఉంచిన మాంసం ఏ జీవిదో తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

READ MORE: AB de Villiers: “ఈ సాలా కప్ నమ్దే” అని అనొద్దన్నాడు..

మొహాలీ అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ డాక్టర్ అమృత్ వారింగ్ మాట్లాడుతూ.. “మోమోస్ తయారీ యూనిట్‌లో దాడులు చేశాం. మోమోస్, స్ప్రింగ్ రోల్స్ తయారు చేసే ఫ్యాక్టరీలోని ఫ్రిజ్‌లో కుక్క తల బయటపడింది. ఫ్యాక్టరీని నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కూడా సమాచారం అందించాం. అయితే, దొరికిన జంతువు తలని మోమోల తయారీలో ఉపయోగించలేదని, వాటి మాంసాన్ని తాము తింటున్నామని ఫ్యాక్టరీ కార్మికులు స్పష్టం చేశారు. పంపిణీకి సిద్ధంగా ఉన్న మోమోస్, స్ప్రింగ్ రోల్స్ ను పరీక్షల కోసం పంపించాం. కుక్క మాంసం ఉపయోగించబడిందా లేదా అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. మోమోలు, స్ప్రింగ్ రోల్స్ తో పాటు చట్నీ నమూనాలను కూడా పంపాం. కూరగాయలు కూడా కుళ్లి పోయాయి. ఫ్రీజ్‌లో కుప్పలు కుప్పలుగా కుళ్లిపోయిన మాంసం లభించింది.” అని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకోని విక్రేతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ సంస్థను నడిపే విక్రేతలు నేపాల్‌కు చెందినవారిగా సమాచారం. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని మొహాలి సివిల్ సర్జన్ డాక్టర్ సంగీత జైనా తెలిపారు.