కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చిరకాల అనుచరుడు పీపీ మాధవన్ (73) సోమవారం మృతి చెందారు. మాధవన్‌ను న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చగా.. గుండెపోటుతో మరణించాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. మాధవన్ చాలా సంవత్సరాలు సోనియా గాంధీకి సహాయకుడిగా పనిచేశాడు. అంతకుముందు రాజీవ్ గాంధీతో కూడా కలిసి పనిచేశారు. ఈ క్రమంలో.. మాధవన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ సోమవారం మహాబలేశ్వర్‌కు చేరుకున్నారు.
Read Also: Sandhya Theatre stampede:సంధ్య థియేటర్ కి మరో షాక్?
కాగా.. ఈరోజు ఉదయం ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు త్రిసూర్ చేరుకున్నారు. ఈ క్రమంలో మాధవన్ నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ, ఆయన తల్లి సోనియా తరఫున కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాహుల్ గాంధీ.. మాధవన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి సుమారు గంటపాటు తన సంతాపాన్ని వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. రాహుల్ గాంధీ పూణే, మహాబలేశ్వర్‌ల పర్యటన వ్యక్తిగతమని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. తనను కలవవద్దని పార్టీ నేతలు, కార్యకర్తలకు రాహుల్ సూచించారు.
Read Also: President Droupadi Murmu: శీతాకాల విడిదికి రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
మాధవన్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సంతాపం వ్యక్తం చేశారు. మాధవన్ దశాబ్దాలపాటు నిస్వార్థంగా పార్టీకి సేవలందించారని తెలిపారు. ఆయన సేవలు, అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. మాధవన్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కాంగ్రెస్ పార్టీ తరుఫున తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వేణుగోపాల్ తెలిపారు.