Rahul Gandhi: సోనియా గాంధీ పర్సనల్ సెక్రటరీ పీపీ మాధవన్ మృతదేహానికి రాహుల్ నివాళులు..
- సోనియా గాంధీ చిరకాల అనుచరుడు పీపీ మాధవన్ (73) సోమవారం మృతి
- చాలా సంవత్సరాలు సోనియా గాంధీకి సహాయకుడిగా పనిచేసిన మాధవన్
- అంతకుముందు రాజీవ్ గాంధీతో కలిసి పనిచేసిన మాధవన్
- త్రిసూర్‌లో మాధవన్ నివాసానికి వెళ్లి నివాళులర్పించిన రాహుల్ గాంధీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చిరకాల అనుచరుడు పీపీ మాధవన్ (73) సోమవారం మృతి చెందారు. మాధవన్‌ను న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చగా.. గుండెపోటుతో మరణించాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. మాధవన్ చాలా సంవత్సరాలు సోనియా గాంధీకి సహాయకుడిగా పనిచేశాడు. అంతకుముందు రాజీవ్ గాంధీతో కూడా కలిసి పనిచేశారు. ఈ క్రమంలో.. మాధవన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ సోమవారం మహాబలేశ్వర్కు చేరుకున్నారు.
Read Also: Sandhya Theatre stampede:సంధ్య థియేటర్ కి మరో షాక్?
Also Read
కాగా.. ఈరోజు ఉదయం ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు త్రిసూర్ చేరుకున్నారు. ఈ క్రమంలో మాధవన్ నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ, ఆయన తల్లి సోనియా తరఫున కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాహుల్ గాంధీ.. మాధవన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి సుమారు గంటపాటు తన సంతాపాన్ని వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. రాహుల్ గాంధీ పూణే, మహాబలేశ్వర్ల పర్యటన వ్యక్తిగతమని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. తనను కలవవద్దని పార్టీ నేతలు, కార్యకర్తలకు రాహుల్ సూచించారు.
Read Also: President Droupadi Murmu: శీతాకాల విడిదికి రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
మాధవన్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సంతాపం వ్యక్తం చేశారు. మాధవన్ దశాబ్దాలపాటు నిస్వార్థంగా పార్టీకి సేవలందించారని తెలిపారు. ఆయన సేవలు, అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. మాధవన్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కాంగ్రెస్ పార్టీ తరుఫున తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వేణుగోపాల్ తెలిపారు.
తాజావార్తలు
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
-
Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!