ఇప్పటికే పుష్ప 2 ప్రీమియర్ కారణంగా అనేక ఇబ్బందుల్లో పడ్డ సంధ్య థియేటర్ యాజమాన్యానికి చిక్కడపల్లి పోలీసులు మరో షాక్ ఇచ్చారు. అసలు విషయం ఏమిటంటే ఈ డిసెంబర్ నెల 5వ తేదీన పుష్ప 2 సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ అయింది. అయితే ఒక రోజు ముందుగానే హైదరాబాదులో ఉన్న సింగిల్ స్క్రీన్స్ తో పాటు కొన్ని మల్టీప్లెక్స్ లలో పుష్ప సినిమాను ప్రీమియర్ గా ప్రదర్శించారు. అందులో సంధ్య థియేటర్ ప్రీమియర్స్ కోసం అల్లు అర్జున్ తో పాటు ఆయన కుటుంబం, హీరోయిన్ రష్మిక కూడా హాజరయ్యారు. అల్లు అర్జున్ వస్తున్న విషయం తెలిసి ఆ సంధ్య థియేటర్ కి ఫ్యాన్స్ తండోపతండాలుగా తరలి వచ్చారు. అల్లు అర్జున్ ను కలిసేందుకు ఎగబడడంతో అక్కడ తొక్కిసలాట ఏర్పడింది.
Shruti Haasan: శృతి హాసన్ తప్పుకుంటుందా? తప్పిస్తున్నారా?
ఈ నేపథ్యంలో రేవతి అనే మహిళ మృతిచెందగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతానికి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే తాజాగా చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ లైసెన్స్ విషయం మీద షోకాజు నోటీసులు జారీ చేశారు. తొక్కిసలాట కారణంగా ఒకరి మృతికి కారణమైన సంధ్య థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అని ప్రశ్నిస్తూ షో కాజ్ నోటీసులు జారీ చేశారు.. ఈ నోటీసుల మీద వారం రోజులలో వివరణ ఇవ్వకపోతే లైసెన్సు రద్దు చేస్తామని కూడా హెచ్చరించారు. అయితే ఈ అంశం మీద సంధ్య థియేటర్ ఎలా స్పందించబోతోంది అనేది హాట్ టాపిక్ అవుతుంది.
ఒక మహిళ మరణానికి దారి తీసిన ఘటనపై సినిమాటోగ్రాఫ్ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ అడిగిన పోలీసులు, పది రోజుల్లోపు వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సంధ్య 70MM థియేటర్ నిర్వహణలో లోపాలు గమనించారు పోలీసులు. సంధ్య 70MM మరియు సంధ్య 35MM థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి.. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకే వైపు ఉన్నాయి. రెండు థియేటర్లలో కలిపి దాదాపు 2520 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లను సూచించే సరైన సైన్ బోర్డులు లేవు. అనుమతి లేకుండా థియేటర్ వెలుపల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రేక్షకులు పోగవ్వడానికి అవకాశం ఇచ్చారు, థియేటర్లో మౌలిక సదుపాయాలు సరిగా లేవు. అల్లు అర్జున్ రాక గురించి స్థానిక పోలీసులకు తెలియజేయడంలో థియేటర్ నిర్వాహకులు విఫలమయ్యారు. అల్లు అర్జున్ రాక పై యాజమాన్యానికి సమాచారం ఉన్నప్పటికీ ఎంట్రీ , ఎగ్జిట్ సీటింగ్ ప్లాన్ చేయలేదు.అల్లు అర్జున్ తో పాటు తన ప్రైవేట్ సెక్యూరిటీని కూడా థియేటర్ లోపలికి అనుమతించారు.టిక్కెట్‌లను తనిఖీ చేయడానికి సరైన వ్యవస్థ లేదు, అనధికారిక ప్రవేశాన్ని అనుమతించి థియేటర్ లోపల రద్దీ పెరిగేలా చేశారని పోలీసులు గుర్తించారు.