NTV Telugu Site icon

Rahul Gandhi: రాజస్థాన్లో రాహుల్ పర్యటన.. కార్యకర్తలనుద్దేశించి కీలక ప్రసంగం

Rahul

Rahul

రాజస్థాన్ లో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటించారు. శనివారం అక్కడ జరిగిన కార్యకర్తల సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం జైపూర్‌లో కొత్త కాంగ్రెస్ కార్యాలయానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. విపక్షాల కూటమి (INDIA) పేరుపై వివాదాన్ని చర్చించడానికి ప్రధాని మోడీ ప్రత్యేక పార్లమెంట్ సెషన్‌ను ప్రకటించాడన్నారు. కాని ప్రజలు ఈ అంశంపై అంగీకరించడం లేదని తెలిపారు.

Read Also: Shraddha Das: బ్లాక్ డ్రెస్ అందాలతో మతి పోగొడుతున్న శ్రద్ధా దాస్

మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము మద్దతిచ్చామని అన్నారు. అంతేకాకుండా దాని అమలుకు కొత్త జనాభా లెక్కలు, డీలిమిటేషన్‌ అవసరమని బీజేపీ చెబుతోందని.. ఈరోజు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయవచ్చని రాహుల్ గాంధీ తెలిపారు. రిజర్వేషన్లను 10 సంవత్సరాలు ఆలస్యం చేసేందుకు బీజేపీ చూస్తోందని అన్నారు. అది అమలైతేనే OBC మహిళలు ప్రయోజనాలు పొందుతారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. అక్కడ నిర్వహించిన భారీ బహిరంగ సభకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారని తెలిపారు. ఈ జనసంద్రాన్ని చూస్తుంటే వేల సింహాలు ఇక్కడ కూర్చున్నట్టు కనిపిస్తున్నాయని అన్నారు.

Read Also: Geethanjali : గీతాంజ‌లి ఈజ్ బ్యాక్‌….అక్క నువ్ మళ్లీ వస్తున్నావా?

అనంతరం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. నేడు కాంగ్రెస్ కుటుంబం మొత్తం జైపూర్‌లో తిష్ట వేసిందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ భవనాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. నేడు రాజస్థాన్ ఆర్థిక వృద్ధి రేటులో ఉత్తర భారతదేశంలో మొదటి స్థానంలో ఉందని.. ఇది చాలా గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. రాజస్థాన్‌లో సుపరిపాలన ఉందని.. ఈసారి కూడా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది తమ సంకల్పం అన్నారు.