Site icon NTV Telugu

Ponnala Lakshmaiah: రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని వెంటనే పునరుద్ధరించాలి..

Ponnala

Ponnala

ఈరోజు దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ రాహూల్ గాంధీ అనర్హత వేటు విషయంలో స్టే ఇవ్వడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా మేము భావిస్తున్నామని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సత్యేమే గెలుస్తుంది అనే వాదన.. సందేశం నానుడి నిజమవుతోందని భావిస్తున్నాము అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎన్ని ఇబ్బందులు పెట్టిన అది మంచికే ఎదురవుతాయి.. చెడ్డకి తాత్కలికంగా ప్రచారం దొరికిన .. చివరకు సత్యమేవ జయతే.. విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు.

Read Also: Viral Video: అబ్బో జోరుగా డబ్బులు లెక్కెడుతున్న పిల్లి.. వీడియో వైరల్

ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి జరుగుతున్నాయి.. దురదృష్టం గుజరాత్ లో ఈ కేసు ఫైల్ అయింది.. దీంతో జడ్జ్ ని మార్చిన తరువాత ఆగమేఘాల మీదా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసే తీర్పు వచ్చింది అని మాజీ పీసీసీ చీఫ్ పొన్నల లక్ష్మయ్య అన్నారు. తీర్పు వచ్చిన 24 గంటలలోపే పార్లమెంటరీ వ్యవస్థ దానికి సంబందించిన అధికారులు సమయం ఇవ్వకుండా అనర్హత వేటు వేయడం.. అత్యంత హేయమైన చర్య అని ఆయన వ్యాఖ్యనించారు.

Read Also: Sound Party: వీజే స‌న్నీ ‘సౌండ్ పార్టీ’కి ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

న్యాయస్థానాలే 30 రోజుల సమయం ఇస్తున్నాయి.. కానీ పార్లమెంటరీ వ్యవస్థలో మాత్రం ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడం దారుణమని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ఈరోజు పులుస్టాప్ పడటం సంతోషం అని పొన్నల లక్ష్మయ్య అన్నారు. సోమవారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇది దేశానికి ప్రజలకి ఒక శుభ సంకేతం.. దేశంలో జరుగుతున్న అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేక కారణాలతో బ్రష్టు పట్టించే నియంత విధంగా పాలన జరుగుతున్న అంశాన్ని పొన్నాల గుర్తు చేశారు.

Read Also: Medak Crime: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని హత్య చేసిన కొడుకు

ఇది చాలాకాలం పాటు కొనసాగదు.. అందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు.. ఈ దేశం, కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగం ఇవి విడదీయరాని అనుబంధంగా ఉన్నాయి.. అనేది చారిత్రాత్మక విషయంగా చెప్పుకోవచ్చు అని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మనమంతా కలసి ఈ పునాదుల మీదా వచ్చాం.. ఈ పునాదులకు నష్టం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన వ్యాఖ్యనించారు. వెంటనే రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని పొన్నాల డిమాండ్ చేశారు.

Exit mobile version