Site icon NTV Telugu

Rahul Gandhi: బ్రహ్మపుత్ర నదిలో రాహుల్ గాంధీ పడవ ప్రయాణం.. ఫొటోలు వైరల్

Rahul Gandhi

Rahul Gandhi

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర అసోం చేరుకుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో పడవ ప్రయాణం చేసి శ్రీశ్రీ ఔనియతి సత్రానికి చేరుకున్నారు. అందులోని కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అతనితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, రాష్ట్ర అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా పలువురు అగ్ర నాయకులు ఉన్నారు. ‘X’ లో రాహుల్ గాంధీ పోస్ట్ చేస్తూ “ఈ రోజు నేను శ్రీశ్రీ ఔనియతి సత్రాన్ని సందర్శించడానికి అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై పడవ ప్రయాణం చేసాను. సాంస్కృతికంగా సంపన్నమైన, శంకర్ దేవ్ జీ భూమి, అస్సాం ప్రతి ఒక్కరినీ తన వెంట తీసుకెళ్లే జీవిత తత్వాన్ని మాకు నేర్పుతుంది. అని కామెంట్ చేశారు. అటువంటి గొప్ప సంస్కృతిని దగ్గరగా తెలుసుకునే, అర్థం చేసుకునే అవకాశాన్ని పొందడం ద్వారా తాను సంతృప్తి చెందానని రాహుల్ గాంధీతెలిపారు.

Read Also: Ayutthaya: ఇది “థాయ్‌లాండ్” అయోధ్య.. భౌగోళికంగా వేరైనా అక్కడా “రామ నామమే”..

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అసోం చేరుకున్న తర్వాత మణిపూర్, నాగాలాండ్ ప్రజల నుంచి తనకు ఎంతో ప్రేమ లభించిందన్నారు. మీ బాధ, మీ సమస్యలు మీకు జరుగుతున్న అన్యాయాన్ని నిశితంగా అర్థం చేసుకోవడమే భారత్ జోడో న్యాయ్ యాత్ర లక్ష్యం అన్నారు. ఈ క్రమంలో.. అస్సాం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మను లక్ష్యంగా చేసుకుని అవినీతి ఆరోపణలు చేశారు.

Read Also: Gun Fire: కారులో వెళ్తున్న వ్యక్తిపై కాల్పులు.. నోయిడాలో ఘటన

అస్సాం ముఖ్యమంత్రి భారతదేశంలో అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి అని.. ద్వేషం ముసుగులో ప్రజా ధనాన్ని దోచుకోవడం మాత్రమే అతని పని అని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. కానీ డబ్బు బలం అస్సాం ప్రజల శక్తిని ఎన్నటికీ ఓడించదని అన్నారు. ఈ అన్యాయంపై పోరాడాలని.. ప్రతి ఒక్కరికీ ఉపాధి ఉండేలా, ప్రకృతి సౌందర్యం, సాంస్కృతిక వైభవం ఎప్పుడూ సుభిక్షంగా ఉండే అలాంటి అసోంను సృష్టించాలని ఆయన అన్నారు.

 

Exit mobile version