Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- రాహుల్ గాంధీ రాయ్‌బరేలీలో పోటీకి భయపడ్డారు..
- అఖిలేష్ యాదవ్ భరోసాతోనే పోటీ..
- సీట్ల పంపకాల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ..
- సంచలన వ్యాఖ్యలు చేసిన ఎస్పీ ఎంపీ శివపాల్ యాదవ్ పటేల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: 2024 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)తో పొత్తు పెట్టుకోకపోతే కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలిచేది కాదని ఎస్పీ ఎంపీ శివపాల్ సింగ్ పటేల్ అన్నారు. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీలో పోటీ చేయడానికి భయపడ్డారని, ఒకానొక దశలో పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధమయ్యారని, అఖిలేష్ యాదవ్ హామీ తర్వాతే అక్కడ నుంచి పోటీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ రాహుల్ గాంధీ పోటీ చేయకపోతే అక్కడి నుంచి ఎస్పీ అభ్యర్థి పోటీలో నిలబడే వారని అన్నారు.
2024 ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్‌కు అండగా నిలిచిందని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులు నిలబడిన చోట ఎస్పీ ఓటర్లు వారికి ఓటేశారని అన్నారు. దీని వల్లే కాంగ్రెస్‌కు యూపీలో 6 లోక్‌సభ సీట్లు గెలిచిందని అన్నారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో ఎస్పీ 37 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 33 సీట్లు గెలుచుకోగా, ఎన్డీయే కూటమి 36 స్థానాలు గెలిచింది.
Also Read
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 150 సీట్లు కోరుతుండటంపై శివపాల్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీట్ల పంపకాల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ అని అన్నారు. పొత్తుకు కాంగ్రెస్ సహకరించాలని, అసంబద్ధ లేదా ప్రతికూల వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. యూపీలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా బ్రహ్మణుడిని, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ముస్లింను నియమించడం పెద్దగా ప్రయోజనం చేయదని ఆయన అన్నారు. యూపీలో కాంగ్రెస్‌కు ఎస్పీనే ‘‘పెద్దన్న’’ అని, ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలని అన్నారు. పొత్తు ఉంటే కాంగ్రెస్‌కు ప్రయోజనం ఉంటుందని, లేకపోతే ఎస్పీకి పెద్దగా నష్టం ఉండదని అన్నారు.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!