Site icon NTV Telugu

Rahul Gandhi: దళితుల విద్యార్థుల కోసం “రోహిత్ వేముల” చట్టం తీసుకురావాలి..

Rahulgandhi1

Rahulgandhi1

రోహిత్ వేముల పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. గతంలో పలు కారణాలతో హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడ్డ దళిత విద్యార్థి రోహిత్ వేముల. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ పేరును ప్రస్తావించారు. విద్యావ్యవస్థలో నేటికి బలహీన వర్గాలు కుల వివక్షను ఎదుర్కొంటున్నాయని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. దళిత విద్యార్థులెవరూ అటువంటి వివక్షను ఎదుర్కోకుండా ఉండాలంటే ‘రోహిత్ వేముల’ చట్టాన్ని రూపొందించాలని.. రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సూచించారు. ఈ రోజు కర్ణాటక సీఎంకు రాహుల్ గాంధీ లేఖ రాశారు.

READ MORE: Prabhas : బ్రేక్ తీసుకుని విదేశాలకు ప్రభాస్

“నేటికి కూడా మన విద్యావ్యవస్థలో దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు ఇటువంటి వివక్షను ఎదుర్కోవడం సిగ్గుచేటు. వెనుకబడిన వర్గాల బిడ్డగా అంబేద్కర్ ఎదుర్కొన్న కష్టాన్ని మరే బిడ్డా ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలి. కొందరు వ్యక్తులు చూపిన వివక్షతో రోహిత్ వేముల, పాయల్ తడ్వి, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్తు ఉన్న యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇకనైనా ఈ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి.” అని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.

READ MORE:Somireddy Chandramohan Reddy: కాకాణిని పట్టిస్తే బహుమతి..! సోమిరెడ్డి ఆఫర్‌..

రోహిత్ వేముల కథేంటి?
వేముల రోహిత్‌ 2016లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యకు యూనివర్సిటీ అధికారులు, ఇతర విద్యార్థి సంఘాలే కారణమనే వాదనలు వినిపించాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, హెచ్‌సీయూ విద్యార్థులు అప్పట్లో పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. దేశవ్యాప్తంగా అనేక రాజకీయపార్టీలు స్పందించాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండుసార్లు హైదరాబాద్‌కు వచ్చి వెళ్లారు. ఆత్మహత్యపై అప్పట్లో సైబరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేసి 2023 నవంబరులో తుది నివేదిక రూపొందించారు.

READ MORE:2025 TVS Apache RR 310: టీవీఎస్ నుంచి సూపర్ ప్రీమియం స్పోర్ట్స్ బైక్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

గతేడాది మార్చి 21న దర్యాప్తు అధికారి ఆ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. అతని ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని హైకోర్టుకు పోలీసులు తెలియజేశారు. అలాగే అతను ఎస్సీ అనేందుకు ఎటువంటి ఆధారాలు కూడా లేవని, బీసీ వడ్డెర కులానికి చెందినవాడని పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పలు పిటిషన్లలో విచారణను ముగించింది. అనంతరం అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఈ కేసుపై పునఃదర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. పోలీసులు విచారణ ప్రారంభించారు.

Tags:

Exit mobile version