NTV Telugu Site icon

Rahul Gandhi: వయనాడ్ లోక్సభ స్థానానికి నేడు రాహుల్ గాంధీ నామినేషన్

Rahul

Rahul

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికలకు రెడీ అయ్యారు. ఇవాళ ఆయన కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి తన నామినేషన్‌ని దాఖలు చేయబోతున్నారు. నామినేషన్ సమర్పణకు ముందు రాహుల్.. కల్పేట పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. వయనాడ్ లోక్ సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో కాంగ్రెస్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కార్యకర్తలు ఈ రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. రోడ్‌షో తరువాత రాహుల్ తన నామినేషన్ పత్రాలను వయనాడ్ జిల్లా కలెక్టర్ రేణు రాజ్‌కి కల్పేటలోని ఆమె కార్యాలయంలో సమర్పించనున్నారు. ఇక, రాహుల్ వెంట కేపీసీసీ అధ్యక్షుడు కె సుధాకరన్ పార్టీ సీనియర్ నేతలు రమేష్ చెన్నితాల, పీకే కున్హాలికుట్టి తదితర నేతలు ఉండనున్నారు.

Read Also: Shashi Tharoor: ప్రధాని మోడీకి ప్రత్యామ్నాయం ఎవరంటే..?

ఇక, ఏప్రిల్ 26వ తేదీన జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు కేరళ రెడీ అయింది. మొత్తం 20 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వయనాడ్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీకి సీపీఐ నేత అన్నీ రాజా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌ల నుంచి గట్టి పోటీ ఉండబోతుంది. 2019 ఎన్నికలలో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి ఘన విజయం సాధించారు. అత్యధిక మెజార్టీతో గెలిచారు. అయితే, సీపీఐ నేత అన్నీ రాజాపై పోటీ చేయాలన్న రాహుల్ నిర్ణయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాగా, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కె సురేంద్రన్ రాహుల్‌పై విమర్శలు చేశారు. కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో రాహుల్ నియోజకవర్గ ప్రజల గురించి పట్టించుకోలేదని ఆరోపణలు గుప్పించారు.