Site icon NTV Telugu

Rahul Gandhi: వైఎస్సార్‌ చేసిన రాజకీయం నేడు రాష్ట్రంలో లేదు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: రాజశేఖర్ రెడ్డి తన తండ్రి సోదరుడు అని.. వాళ్ళిద్దరిది రాజకీయ సంబంధమే కాదు అన్నాతమ్ములు లాగా కలిసిమెలిసి ఉండేవారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కడపలో రాహుల్‌ ప్రసంగించారు. రాజశేఖర్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశానికి మార్గదర్శకులుగా ఉండేవారన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తన జోడో యాత్రకు ప్రేరణ అని ఆయన వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డి దేశవ్యాప్తంగా మీరు పాదయాత్ర చేయాలని తనతో చెప్పాడని రాహుల్‌ పేర్కొన్నారు.ఎప్పుడైతే మనం పాదయాత్ర చేస్తామో అప్పుడు మనం ప్రజల్లోకి వెళ్లి వాళ్ల కష్టసుఖాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని వైఎస్సార్ చెప్పారన్నారు. తాను రాజశేఖర్ రెడ్డి ద్వారా ప్రేమ విద్వేషపు ప్రాంతాల్లో ప్రేమను వికసింపజేశానన్నారు. రాజశేఖర్ రెడ్డి చేసిన రాజకీయం నేడు రాష్ట్రంలో లేదన్నారు. మార్పుతో కూడిన రాజకీయం నేడు నడుస్తోందన్నారు.

Read Also: Arvind Kejriwal: తొందరలోనే మమతా బెనర్జీ, స్టాలిన్, పినరయి విజయన్ జైలుకు పోతారు..

ఈరోజు ఈ రాష్ట్రాన్ని బీజేపీకి బీ టీం నడిపిస్తుందని.. బీ టీం అంటే బాబు, జగన్, పవన్ అని విమర్శించారు. ఎందుకంటే నరేంద్ర మోడీ చేతిలో సీబీఐ ,ఈడీ ఉంది కాబట్టే వీళ్లు ఆయనకు మద్దతు తెలుపుతున్నారన్నారు. బీజేపీకి, రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతం ఎప్పుడు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుందన్నారు. జగన్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. ఎందుకంటే చాలా అవినీతి కేసులు జగన్‌పై ఉన్నాయన్నారు. ఇదే అలవాటు చంద్రబాబు నాయుడుకు కూడా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌లోని పౌరులకు ఒక వాగ్దానం చేసిందని.. ఏపీ విభజన సమయంలో ప్రజలకు వాగ్దానం చేసిందని.. మీకు ప్రత్యేక హోదా లభించిందా అంటూ రాహుల్ ప్రశ్నించారు. మీకు పోలవరం ప్రాజెక్టు లభించిందా అంటూ ప్రశ్నలు గుప్పించారు. మీకు కడప స్టీల్ ప్లాంట్ లభించిందా అని అడిగారు.

Read Also: CM Revanth Reddy: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వీడియో సందేశం..

రాహుల్‌ మాట్లాడుతూ..”ఏదైతే ప్రభుత్వం ఉందో అది బీజేపీ ముందు తలవంచుకొని ఉంది. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.అధికారం లోకి కేంద్ర ప్రభుత్వంరాగానే ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసి తీరుతాం. రెండున్నర లక్ష ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఐదు లక్షలతో నిరుపేదలకు ఇల్లు కట్టిస్తాం. మా ప్రభుత్వం రాగానే ఇంతవరకు ఏ ప్రభుత్వం తీసుకోలేని నిర్ణయాన్ని తీసుకుని అమలు చేసి తీరుతాం. ఏడాదికి ఒక మహిళ అకౌంట్‌కు లక్ష రూపాయలు జమ చేస్తాం.నరేంద్ర మోడీ 25 మందిని మాత్రమే కోటీశ్వరులు చేశాడు. మేము కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేస్తాం. రైతులకు రుణాలు మాఫీ చేస్తాం. రైతులకు కనీస మద్దతు ధర ఇస్తాం. దేశవ్యాప్తంగా 30 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు రక్తాన్ని చిందించి కష్టపడుతున్నారు. నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని తొలగించి తన మనసులో ఏది వస్తే అది అమలు చేయాలి అనుకుంటున్నాడు.భారత రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు.” అని రాహుల్‌ గాంధీ అన్నారు.

Exit mobile version