NTV Telugu Site icon

Congress: జమ్మూ కాశ్మీర్‌లో జరిగే ఎన్నికలకు 27 మంది స్టార్ క్యాంపెయినర్లు.. తెలంగాణ సీఎంకి చోటు

Congress List

Congress List

జమ్మూ కాశ్మీర్‌లో జరిగే ఎన్నికలకు 27 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ (INC) ఇవాళ (శనివారం) విడుదల చేసింది. ఐదు దశల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ నేతలు జమ్మూ కాశ్మీర్‌లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. జమ్ము అండ్ కశ్మీర్ పార్లమెంట్ ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్ల జాబితాను INC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సెక్రటరీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సమర్పించారు.

Read Also: Mansukh Mandaviya: ఇంతకీ నీవు కేంద్ర మంత్రివా.. టీమిండియా ప్లేయర్వా..

అయితే, స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, అంబికా సోనీ, కెసి వేణుగోపాల్, సచిన్ పైలట్, భరత్‌ సింగ్ సోలంకి, వికార్ రసూల్ వానీ, జీఎ మీర్, తారిక్ హమీద్ కర్రా, సుఖ్వీందర్ సింగ్ సుఖు, రేవంత్ రెడ్డి, హరీష్ ఉన్నారు. 27 మంది పేర్ల జాబితాలో ప్రమోద్ తివారీ, పవన్ ఖేరా, రంజీత్ రంజన్, టీఎస్ సింగ్ డియో, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, రాజ్ బబ్బర్, పిర్జాదా మొహమ్మద్ సయీద్, మనోజ్ యాదవ్, తారా చంద్, రామన్ భల్లా, చౌదరి లాల్ సింగ్, జిఎన్ మోంగా, షమీమా రైనాతో పాటు ఆకాష్, భరత్ ఉన్నారు.

Read Also: Daniel Balaji : చనిపోతూ ఇద్దరి జీవితాల్లో వెలుగునింపిన నటుడు.. ఎంత గొప్ప మనసు నీది..

ఇక, 2024లో జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి లోక్‌సభకు జరిగే మొదటి, రెండవ దశల సాధారణ ఎన్నికల కోసం 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 77 (1) ప్రకారం భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన నాయకులు ప్రచారం చేస్తారు. జమ్మూ అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికల తర్వాత జరుగుతుందని చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. అయితే, సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలతో పాటు 26 అసెంబ్లీ ఉప ఎన్నికల తేదీలను ప్రకటించారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్ 19 (ఉదంపూర్), ఏప్రిల్ 26 (జమ్మూ), మే 7 (అనంతనాగ్-రాజౌరీ), మే 13 (శ్రీనగర్), మే 20 (బారాముల్లా) తేదీల్లో ఐదు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.