Site icon NTV Telugu

Rahul Gandhi: మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలన్నది వారి వ్యక్తిగత విషయం..

Rahul

Rahul

Aligarh Muslim University Students: మహిళల దుస్తుల ఎంపికను గౌరవించాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఒక వ్యక్తి ఏం ధరించాలో నిర్దేశించకూడదన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీకి చెందిన మహిళా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ.. ఈ కామెంట్స్ చేశారు. అయితే, కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించింది. గతంలో దీనిపై తీవ్ర దుమారం రేగింది.

Read Also: IND vs ENG: టీమిండియా కెప్టెన్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌?

అయితే, కర్ణాటకలో హిజాబ్ ధరించడాన్ని నిషేధించడంపై ఓ విద్యార్థిని రాహుల్‌ గాంధీని ప్రశ్నించింది. మీరు ఒక వేళ ప్రధాన మంత్రి అయితే’ అంటూ ఆ వివాదంపై అభిప్రాయాన్ని కోరింది.. దానికి, ఒక మహిళ ఏం ధరించాలన్నది ఆమె వ్యక్తిగత విషయం.. అందుకు అనుమతించాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.. మీరేం ధరించాలనేది పూర్తిగా అది మీ నిర్ణయం.. దానిని మరొకరు నిర్దేశించాలని నేను అనుకోను అని రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు.

Read Also: Rashmika Mandanna: నా కాబోయే భర్త ‘VD’ అయ్యి ఉండాలి..

ఇక, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు కొద్ది నెల లక్రితం ప్రకటించింది. రాష్ట్రంలోని మహిళలు ఏ దుస్తులు ధరించాలి.. ఏం తినాలి అనేది వారి ఇష్టం అని చెప్పుకొచ్చింది. నేనేందుకు వాళ్లను అడ్డుకోవాలి? ఎవరికి నచ్చిన దుస్తులు వారు ధరించడంలో తప్పు ఏముంది? అని ఆ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు.

Exit mobile version