NTV Telugu Site icon

Rahul Ganghi : బ్రిటీషర్లకు సావర్కర్ సాయం చేశాడు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు

Rahul

Rahul

Rahul Ganghi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ హిందుత్వ వాది వినాయక్ దామోదర్ సావర్కర్ బ్రిటీషర్లకు సాయం చేశాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభిమాన నేత వీర్ సావర్కర్ భారత్ స్వాతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో బ్రిటీషర్లతో ఎలా వ్యవహరించాడన్న దాన్ని బయటపెట్టేలా ఉన్న ఓ లేఖను రాహుల్ గాంధీ ఇవాళ బయటపెట్టారు. భారత జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలో ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పట్లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు గాంధీ, నెహ్రూ, పటేల్ లను మోసం చేసేలా సావర్కర్ లేఖలు ఉన్నట్లు రాహుల్ తెలిపారు.

Read Also: Angry Elephant: ఏనుగుకు ఎదురెళ్లారు.. ఊరుకుంటుందా 8కి.మీ పరిగెత్తించి మరీ

కొన్ని రోజుల క్రితం సావర్కర్ పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఇవాళ కూడా ఆ వ్యాఖ్యలను బలపరుస్తూ లేఖను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనేది లేదని కావాలంటే మ‌హారాష్ట్ర ప్రభుత్వం కావాలంటే త‌న‌ను అరెస్టు చేసుకోవ‌చ్చు అని కూడా రాహుల్ స‌వాల్ చేశారు.

Read Also: Mobile Phones Ban: అక్కడ మొబైల్‌ ఫోన్స్‌ వాడడంపై నిషేధం.. ఏకగ్రీవ తీర్మానం

రాహుల్ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో .. శివ‌సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. వీడీ సావర్కర్ ప‌ట్ల త‌మ‌కు ఎన‌లేని గౌర‌వం ఉంద‌న్నారు. సావర్కర్ పై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మ‌రో వైపు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడిపై కాంగ్రెస్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు బీజేపీ ఆరోపించింది.