Angry Elephant: ఏనుగుకు ఎదురెళ్లారు.. ఊరుకుంటుందా 8కి.మీ పరిగెత్తించి మరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Angry Elephant: గజరాజులు శాంతంగా ఉన్నంత వరకే… వన్స్ వాటికి కోపం వచ్చిందా.. బీభత్సం చేస్తాయి. అవి మనకు కనిపించినప్పుడు.. వాటి కంట మనం పడకుండా జాగ్రత్తగా ఉండాలి. లేదంటూ స్టైల్ గా సెల్ఫీలకోసం ఎగబడ్డారో అంతే సంగతులు.. తాజాగా ఇలాంటి ఘటనే కేరళలో చోటు చేసుకుంది. కాకపోతే ఇక్కడ సెల్ఫీలకోసం పోలేదు కానీ గజరాజుకు మనోళ్లు కంటపడ్డారు. ఇంకేముంది 8కిలోమీటర్లు పరిగెత్తించింది. ఇప్పుడు ఇదేవీడియో వైరల్ అవుతోంది.
Read Also: Football Stadium: ఆ స్టేడియాన్ని ఎక్కడికంటే అక్కడికి మడతపెట్టి తీసుకెళ్లొచ్చు
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
కేరళలోని చాలకుడి నుంచి వాల్పరాయ్ మార్గంలో 40 మంది టూరిస్టులతో ఓ ప్రైవేట్ బస్సు బయలుదేరింది. మార్గమధ్యంలో ఓ ఏనుగు ఆ బస్సుకు ఎదురు వచ్చింది. బస్సు వైపే ఆగ్రహంతో పరుగు తీయడంతో టూరిస్టులు ఆందోళన చెందారు. డ్రైవర్ అంబుజాక్షన్ ఆ బస్సును రివర్స్ పోనిచ్చాడు. ఏకంగా 8 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత ఆ ఏనుగు అడవిలోకి వెళ్లిపోవడంతో డ్రైవర్‌తో పాటు ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read Also:Elon Musk: ఉద్యోగులనే కాదు.. ఒంట్లో కొవ్వునూ వదలట్లేదు.. ఏకంగా 13కేజీలు తగ్గిన మస్క్
‘అటవీ ప్రాంతాల మీదుగా ఎన్నోసార్లు డ్రైవింగ్ చేశా. కానీ, నా జీవితంలో ఇలాంటిది తొలి ఘటన. బస్సులో ఉన్న వారందరూ భయంతో వణికిపోయారు. బస్సును రివర్సులో తీసుకురావడం తప్ప మాకు మరో మార్గం కనిపించలేదు’ అని అంబుజాక్షన్ అన్నారు. ‘కబాలి’ అనే పేరుగల ఏనుగు గత కొన్ని నెలలుగా ఆ ప్రాంతంలోని ప్రజలను ఆందోళనకు గురి చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది మేలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. టూరిస్టులతో వెళ్తున్న సఫారీ వాహనాన్ని ఏనుగు అడ్డగించి దాడి చేసింది. వాహనంలో ఉన్న టూరిస్టులు భయంతో వణికిపోయారు.
हाथी से बचने के लिए रिवर्स में दौड़ाई बस: 8 किमी तक पीछा किया, ड्राइवर ने 40 से अधिक यात्रियों की जान बचाईhttps://t.co/7Xc7pFnu7a#Kerala #Elephant #viral pic.twitter.com/4ndQwEtvKx
— Dainik Bhaskar (@DainikBhaskar) November 16, 2022
Kabaali, the infamous tusker in chalakudy forests of Kerala charging against a private bus forcing the bus driver to drive over 8 kms in the reverse direction despite the road having plenty of sharp turns and bends😵…..👏👏👏kudos to the brave driver Shri Ambujakshan pic.twitter.com/a95PshaCfo
— Mathew George (@Matblore) November 17, 2022
- Tags
- Angry Elephant
- bus
- elephant
- Kerala
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!