NTV Telugu Site icon

Ganderbal Terror Attack: ఉగ్రవాదంపై పోరులో దేశం ఏకమైంది: రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi

Ganderbal Terror Attack: జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బల్‌లో ఉగ్రవాదులు పిరికిపంద చర్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మెస్‌లో భోజనం చేస్తున్న కార్మికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ డాక్టర్‌తో సహా ఏడుగురు చనిపోయారు. ఈ ఉగ్రదాడిపై తాజాగా రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బల్‌లో జరిగిన ఉగ్రదాడిలో వైద్యుడు, వలస కూలీలు సహా పలువురిని చంపడం చాలా పిరికి పని అని, క్షమించరాని నేరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Read Also: Naga Chaitanya Shobita Weeding: మొదలైన నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల పెళ్లి పనులు..

ఉగ్రవాదుల ఈ దుస్సాహసం జమ్మూకశ్మీర్‌లో జీవన విధానాన్ని, ప్రజల విశ్వాసాన్ని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయదని రాహుల్ గాంధీ అన్నారు. ఉగ్రవాదంపై పోరులో దేశం మొత్తం ఏకమై ఉందని ఉద్ఘాటించారు.

Read Also: Malla Reddy Mass Dance: పెళ్లి సంగీత్ లో మల్లన్న మాస్‌ స్టెప్పులు..