Milk Price In Pakistan: పాక్లో దడ పుట్టిస్తున్న పాల ధర.. ప్రజలు ఏం చేశారంటే..?
- పాకిస్తాన్ ప్రజలకు మరో షాక్..
- పాల మీద 18 శాతం పన్ను విధించిన పాక్ ప్రభుత్వం..
- పారిస్.. మెల్‌బోర్న్ తో పోలిస్తే.. పాకిస్తాన్ లోనే లీటర్ పాల ధర రూ. 370..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Milk Price In Pakistan: పాకిస్తాన్ పౌరులకు అక్కడి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న వారిపై.. కొత్తగా పాలపై పన్ను విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో స్థానికంగా పాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలైన ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కంటే పాల ధరలు పాక్‌లోనే అత్యధికంగా ఉన్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు సైతం అక్కడి ప్రజలను భయపెడుతున్నాయి. అయితే, పాకిస్థాన్ పాలపై ఎలాంటి పన్నూ ఉండేది కాదు.. అలాంటిది గత వారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ప్యాకేజ్డ్ పాలపై అక్కడి ప్రభుత్వం ఎకంగా 18 శాతం పన్ను వేసింది. దీంతో పాల ధరలు 25 శాతానికి పైగా పెరిగిపోయాయి. కొత్తగా పన్ను వేయడంతో కరాచీలో అల్ట్రా హై టెంపరేచర్ పాల ధర రూ. 370 (పాకిస్తాన్ కరెన్సీ) చేరుకుంది. డాలర్ల ప్రకారం చూస్తే లీటర్ పాల ధర 1. 33 డాలర్లుగా ఉండగా.. పారిస్‌లో లీటర్ పాల ధర 1.23 డాలర్లు ఉంటే.. మెల్‌బోర్న్‌లో 1.08 డాలర్లు మాత్రమే ఉంది.
Read Also: Keir Starmer: యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ విక్టరీ.. తదుపరి ప్రధానిగా కీర్ స్టామర్
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
ఇక, పాల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగిపోతుందని ఆర్థిక నిపుణులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు, వేతనాలు అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఖర్చు చేసే సామర్థ్యం మరింత క్షీణించే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు. పాక్‌లో ఇప్పటికే సుమారు 40 శాతం మంది పేదరికంలో మగ్గిపోతున్నారు.. ముఖ్యంగా పేదరికంలో ఉన్న చిన్నారుల్లో పౌష్టికాహార లోపానికి ఇది దారి తీస్తుందనే విషయం ఆందోళన కలిగిస్తుంది. బెయిలవుట్ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) విధించిన షరతులను అందుకోవడంలో భాగంగానే పాకిస్థాన్ ఇటీవల బడ్జెట్‌లో ఏకంగా 40 శాతం మేర పన్నులను పెంచేసింది.
తాజావార్తలు
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!