NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీ వ్యవహారాలపై కాంగ్రెస్‌ అధిష్టానం ఫోకస్‌.. వైఎస్‌ షర్మిలకు కీలక బాధ్యతలు..! నేడు ఫైనల్..!

Cong

Cong

Andhra Pradesh: కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై ఫోకస్‌ పెడుతోంది.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అధిష్టానంతో సమావేశం కానున్నారు ఏపీ నేతలు.. సుమారు 30 మంది ఏపీ కాంగ్రెస్‌ నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.. తెలంగాణలో విజయం తర్వాత ఏపీ కాంగ్రెస్ పై రాహుల్ గాంధీ దృష్టి పెట్టారు.. ఇటీవల సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు.. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక, నిర్వహించనున్న బాధ్యతలపై చర్చించనట్టు తెలుస్తోంది.. “స్టార్ కాంపైనర్”గా షర్మిలకు ఏపీలో బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఇక, ఇవాళ్టి భేటీలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ రోజు సమావేశానికి ఏపీసీసీ అధ్యక్షుడు గిడిగు రుద్రరాజు, ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, చింతా మోహన్, కొప్పుల రాజు, జేడీ శీలం తదితర సీనియర్ నాయకులు.

Read Also: Vishnu Stotram: ఈ స్తోత్రాలు వింటే మీకు అన్నింట్లో ధన లాభం కలుగుతుంది

ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశం జరగనుంది. ఈ భేటీకి ఏపీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో పాటు రాహుల్‌ గాంధీ కూడా హాజరుకానున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోకసభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలు, ఏపీలో పొత్తులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజం చేసేలా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అధిష్టానం సిద్ధమైందంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ షర్మిల చేరితే “స్టార్ కాంపైనర్” గా ఏపీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

Read Also: Vijayakanth : మరోసారి ఆస్పత్రిలో చేరిన హీరో విజయ్‌కాంత్.. ఆందోళనలో ఫ్యాన్స్

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ అధిష్టానంతో సమావేశం అయ్యారు వైఎస్‌ షర్మిల.. సోనియా, రాహుల్‌ గాంధీలతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు.. ఆ తర్వాత తెలంగాణలో పొత్తు ఉంటుందనే కొంత ప్రచారం జరిగింది.. అయితే, కాంగ్రెస్‌ నుంచి ఎక్కడా దీనిపై స్పందించలేదు.. కానీ, కొంతకాలం తర్వాత ఎంత వేచిచూసినా వారి నుంచి స్పందన లేదు.. అందుకే తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.. ఇక, మరికొంత సమయం తీసుకుని.. పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటువేయాలని పిలుపునిచ్చారు. అయితే, తెలంగాణ పార్టీ పెట్టిన వైఎస్‌ షర్మిల సేవలను ఏపీలో వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఆమెకు కీలక బాధ్యతల అప్పగించే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించబోతున్నారనే వార్తలు కూడా హల్‌ చల్ చేస్తున్నాయి.. ఏపీ రాజకీయాల్లో ఆమె కీలక పాత్రను పోషించబోతున్నట్టు చెబుతున్నారు.. ఈ వార్తలపై స్పందించిన ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. వైఎస్‌ షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తాం అన్నారు. పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము శిరసా వహిస్తామన్న ఆయన.. ఏపీ కాంగ్రెస్ నేతలతో అధిష్ఠానం సమావేశమవుతోంది. ఏపీ ఎన్నికలు, ప్రస్తుత పార్టీ పరిస్థితి, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ లాంటి అంశాలపై చర్చ జరగనుంది అన్నారు.

Show comments