NTV Telugu Site icon

Viral Video: లోక్‌సభలో నిద్రపోయిన రాహుల్ గాంధీ!..వీడియో వైరల్..బీజేపీ నేతల ట్రోల్స్

Rahul

Rahul

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతున్నప్పుడు రాహుల్ గాంధీ నిద్రపోతున్నారని అధికార పార్టీ వాదిస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ నాయకుడిని గిరిరాజ్ సింగ్ ఎలా ఎగతాళి చేశాడో చూపించిన వీడియోను బీజేపీ నేతలు షేర్ చేశారు. అయితే వైరల్ అవుతున్న వీడియో అప్పటిదా కాదా అనేది తెలియదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చాలా మంది రైట్ వింగ్ మద్దతుదారులు.. బీజేపీ నాయకులు చర్చ నడుస్తున్న
టైమ్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిద్రపోయారని పేర్కొంటూ ఆయన చిత్రాన్ని పోస్ట్ చేశారు.

READ MORE: Committee Kurrollu Review: నిహారిక ‘కమిటీ కుర్రాళ్ళు’ రివ్యూ!

వక్ఫ్ సవరణ బిల్లుపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతుండగా.. ఆయన పక్కనే బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ కూర్చున్నట్లు ఓ వీడియోలో చూడొచ్చు. రిజిజు మాట్లాడిన వెంటనే గిరిరాజ్ సింగ్ ప్రతిపక్ష నేతపైపు వైపు చూపిస్తూ కనిపించారు. ఈ సమయంలో హఠాత్తుగా భూపేంద్ర యాదవ్, జితేంద్ర సింగ్‌తో సహా కిరణ్ రిజిజు పక్కన కూర్చున్న బీజేపీ ఎంపీలు ఆయన వైపు చూపిస్తూ నవ్వడం ప్రారంభించారు.

Show comments