Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi and PM Modi: తమిళనాడు రాజకీయాల్లో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు చెన్నైలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ అయ్యే అవకాశం ఉండటంతో ఈ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఇద్దరి మధ్య మధ్యాహ్న భోజన సమయంలో సమావేశం జరిగే అవకాశముందని సమాచారం. టీవీకే–కాంగ్రెస్ కూటమి నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.
విద్యార్థులతో రాహుల్ గాంధీ ముఖాముఖి
చెన్నై ఐలాండ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ‘విద్యార్థుల గొంతుక’ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి చర్చించి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోనున్నారు. నీట్ పరీక్ష, పేపర్ లీకేజీలు, విద్యా ఫీజుల పెంపు వంటి అంశాలు ఈ కార్యక్రమంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థుల అభిప్రాయాలు, విద్యారంగంలో ఎదురవుతున్న సవాళ్లపై ఆయన చర్చించనున్నారు. సీఎం విజయ్‌తో భేటీ, విద్యార్థుల కార్యక్రమం ఒకే రోజు ఉండటంతో రాహుల్ పర్యటన తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
- Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
రేపు చెన్నైకి ప్రధాని మోదీ
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ రేపు (అక్టోబర్ 11) చెన్నైలో పర్యటించనున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా ఉదయం 10.55 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో చెన్నై మెట్రో రెండో దశలోని పూందమల్లి – వడపళని మార్గాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం పూందమల్లి నుంచి పోరూరు వరకు మెట్రో రైలులో ప్రయాణించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో తమిళనాడు సీఎం విజయ్ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇళయరాజా సంగీత కేంద్రం ప్రారంభం
మెట్రో ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో పాటు చెన్నై ఐఐటీలో స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేరుతో ఏర్పాటు చేసిన సంగీత అభ్యాసం, పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అలాగే రైల్వేలు, జాతీయ రహదారులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు సంబంధించిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
కోయంబత్తూరులో రూ.700 కోట్ల రైల్వే ప్రాజెక్టులు
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులో సుమారు రూ.700 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు కూడా ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. దీంతో పాటు పలు రైల్వే స్టేషన్లలో అమృత్ భారత్ స్టేషన్ పథకానికి సంబంధించిన కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ పర్యటన, మరోవైపు ప్రధాని మోడీ అభివృద్ధి కార్యక్రమాలు ఉండటంతో చెన్నైలో రాజకీయ, అభివృద్ధి సంబంధిత కార్యక్రమాలపై అందరి దృష్టి నెలకొంది.
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!