Site icon NTV Telugu

Nyay Yatra: నేడు ఒడిశాకు చేరుకోనున్న రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ యాత్ర

Rahul Gandhi

Rahul Gandhi

జార్ఖండ్ రాష్ట్రంలో భారత్ జోడో న్యాయ యాత్ర పూర్తయ్యాక కాంగ్రెస్ ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలోకి అడుగులు వెస్తు్ంది. నేడు సుందర్‌గఢ్‌ జిల్లా నుంచి రాహుల్‌ గాంధీ ఒడిశాలోకి అడుగు పెట్టనున్నారు. రాహుల్‌కు స్వాగతం పలికేందుకు ఒడిశా కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేశారు. సుందర్‌గఢ్‌ జిల్లాలోని పారిశ్రామిక పట్టణం బిరామిత్రపూర్‌లో ఒడిశా హస్తం నేతలు రాహుల్ గాంధీకి స్వాగతం పలకనున్నారు.

Read Also: Family Star : ‘ ఫ్యామిలీ స్టార్’ మ్యూజికల్ సందడి షురూ..మెలోడియస్ సాంగ్ ప్రోమో రిలీజ్..

ఇక, రాహుల్ గాంధీ ఇవాళ మధ్యాహ్నం బిరామిత్రాపూర్ చేరుకోనున్నారని ఒడిశా పీసీసీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్ తెలిపారు. భారత్ జోడో న్యాయ యాత్ర బిజా బహల్ ప్రాంతంలో రెస్ట్ తీసుకోనున్నారు. ఆ తర్వాత రేపు (బుధవారం) రూర్కెలాలోని ఉదిత్‌నగర్ నుంచి పాన్‌పోష్ వరకు 3.4 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. రాహుల్ గాంధీ పాన్‌పోష్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు.

Read Also: Uttam Kumar Reddy : బీఆర్‌ఎస్‌ పది ఏండ్ల పాలనలో అవినీతి తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు

అయితే, మరుసటి రోజు రాణిబంద్ నుంచి భారత్ జోడో న్యాయ యాత్ర తిరిగి స్టార్ట్ అవుతుంది. రాజ్‌గంగ్‌పూర్‌లో జరిగే ర్యాలీలో కూడా రాహుల్ మాట్లాడనున్నారు అని ఒడిశా పీసీసీ చీఫ్ శరత్ పట్నాయక్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 8న రాహుల్ గాంధీ జర్సుగూడ పాత బస్టాండ్ నుంచి యాత్రను కొనసాగిస్తారు.. జార్సుగూడలోని కనక్‌తోరా నుంచి యాత్ర మొదలై అనంతరం ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశిస్తుంది అని ఆయన వెల్లడించారు.

Exit mobile version