Family Star : ‘ ఫ్యామిలీ స్టార్’ మ్యూజికల్ సందడి షురూ..మెలోడియస్ సాంగ్ ప్రోమో రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. దర్శకుడు పరశురాం తెరకెక్కిస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది.అయితే, ఇప్పటి నుంచే ఈ సినిమాకు ఆడియన్స్ లో బజ్ తెచ్చేందుకు సిద్ధం అయింది. గోతగీవిందం తర్వాత విజయ్ దేవరకొండ దర్శకుడు పరశురాం కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రెడీ అయింది. ‘నందనందనా’ అంటూ ఈ పాట ఉండనుంది. ఈ సాంగ్ ప్రోమో నేడు (ఫిబ్రవరి 5) రిలీజ్ అయింది.నందనందనా అంటూ సాగే ఈ పాట మెలోడియస్‍గా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ మరోసారి హృదయాన్ని హత్తుకునే ట్యూన్ ఇచ్చారని ఈ ప్రోమోను చూస్తే అర్థమవుతోంది.
నందనందనా అనే హమ్మింగ్ ఆకట్టుకునేలా ఉంది. హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ఈ ప్రోమోలో కనిపించారు. ఈ పాటను సిద్ధ్ శ్రీరామ్ పాడారని టీమ్ వెల్లడించింది. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాశారు.ఫ్యామిలీ స్టార్ నుంచి ‘నందనందనా’ ఫుల్ పాట ఫిబ్రవరి 7న రానుంది. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. “ఫ్యామిలీ స్టార్ మ్యూజికల్ అడ్వెంచర్ ఓ మైమరిపించే మెలోడీతో మొదలుకానుంది. నందనందనా ప్రోమో వచ్చేసింది. పూర్తి పాట ఫిబ్రవరి 7వ తేదీన మీ ముందుకు రానుంది ” అని ట్వీట్ చేసింది.విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీతగోవిందం (2018) సినిమాలో ‘ఇంకేం.. ఇంకేం కావాలే’ పాట ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పాటతో ఆ సినిమాకు ఫుల్ క్రేజ్ వచ్చింది. గోపీ సుందర్ స్వరపరిచిన ఆ పాటను సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారు.అనంత్ శ్రీరామ్ రిలిక్స్ అందించారు. డైరెక్టర్ పరుశురామ్ టేకింగ్ కూడా ఆ పాటకు సరిగ్గా సరిపోయింది. దీంతో ఆ సాంగ్ ఫుల్ పాపులర్ అయింది. అయితే, ఫ్యామిలీ స్టార్‌లో ‘నందనందనా’ పాటకు అదే కాంబో రిపీట్ అవుతోంది. ఈ సాంగ్‍కు గోపీసుందర్ ట్యూన్స్ ఇవ్వగా.. సిద్ధ్ శ్రీరామ్ పాట పాడారు అలాగే అనంత్ శ్రీరామ్ సంగీతం అందించారు.
Also Read
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!