బోర్డర్-గవాస్కర్ సిరీస్ విజేతగా నిలిచేందుకు భారత్, ఆస్ట్రేలియా జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. స్వదేశంలో ఓటమంటూ ఎరుగని టీమిండియా ఈసారి కూడా ఆ రికార్డు కొనసాగించాలని చూస్తోంది. మరోవైప్ ఆసీస్ మాత్రం ఎలాగైనా ఈ సిరీస్ ఎగరేసుకుపోవాలన్న పట్టుదలతో ఉంది. ఇందుకోసమే సొంతంగా స్నిన్ పిచ్‌లు తయారు చేసుకుని మరీ ప్రాక్టీస్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సిరీస్‌కు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఇండియాపై టెస్టు సిరీస్ గెలవడం యాషెస్ కంటే ఎక్కువన్న ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ మాటల్ని బట్టే ఈ సిరీస్ గెలుపు వారికి ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. దీంతో ఇండియా కూడా సకల అస్త్రాలు సిద్ధం చేస్తోంది. హెడ్ కోచ్ ద్రవిడ్ సారథ్యంలో ప్రాక్టీస్‌లో చెమటోడుస్తోంది.
Also Read: OnePlus Launch Event: నేడే వన్‌ప్లస్ లాంచ్ ఈవెంట్.. లైవ్ ఎక్కడ చూడొచ్చంంటే!
ఈ క్రమంలోనే.. స్పిన్నర్లనే కాదు ఆసీస్ పేసర్లను ధీటుగా ఎదుర్కొనేందుకు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాస్టర్ ప్లాన్ సిద్దం చేశాడు. అటాకింగ్ గేమ్ ఆడాలని బ్యాటర్లకు చెబుతున్నాడట. గత ఆసీస్ పర్యటనలో రిషభ్ పంత్ దూకుడు మంత్రంతోనే సక్సెస్ అయ్యాడని, జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడని భారత బ్యాటర్లకు వివరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నెట్స్‌లో భారత బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల చేత ద్రవిడ్ స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ప్రాక్టీస్ చేయించాడని సమాచారం. స్పిన్నర్లతో పాటు పేస్ బౌలింగ్‌లోనూ ఎదురు దాడికి దిగాలని, ఆచితూచి ఆడితే జట్టుకు నష్టం కలుగుతోందని ద్రవిడ్ ఆటగాళ్లకు చెప్పినట్లు తెలుస్తోంది.
పుజారాకు చోటు లేదా?
స్వీప్ షాట్లతో ఆస్ట్రేలియా స్పిన్నర్లపై ఎదురు దాడికి దిగాలని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌లకు ద్రవిడ్ సూచించాడు. పంత్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో భారత బ్యాటింగ్‌లో ఫైర్ పవర్ మిస్సవ్వనుందని, శ్రేయస్ అయ్యర్ కూడా లేకపోవడంతో సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవాలనే యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం. తనదైన స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో స్పిన్‌ను సమర్ధవంతంగా ఆడగలిగే సూర్యకుమార్‌ను జట్టులోకి తీసుకుంటే ఆసీస్ బౌలర్లను ఇబ్బంది పెడతాడని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెటరన్ బ్యాటర్ పుజారాను పక్కనపెట్టి సూర్యను ఆడించాలనే వ్యూహం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రయోగం సక్సెస్ అయితే మిగతా టెస్టుల్లో కొనసాగించాలని, విఫలమైతే మళ్లీ పుజారాను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పుజారాకు తిరుగులేదు. ఈ తరం క్రికెటర్లలో బీజీటీలో అతనే టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.
Also Read: Rajasthan: అమానుషం.. అమ్మాయిని కలిసేందుకు వచ్చినందుకు కొట్టి, మూత్రం తాగించారు..