Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ కీలక నిర్ణయం!
- రాహుల్ ద్రవిడ్ కీలక నిర్ణయం
- రాజస్తాన్ రాయల్స్‌కు ద్రవిడ్ గుడ్‌బై
- ఐపీఎల్ 2012, 2013 సీజన్లలో కెప్టెన్‌గా ద్రవిడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ఆర్ఆర్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. తాము ఆఫర్ చేసిన పదవిని ద్రవిడ్ వద్దన్నారని తెలిపింది. ఆర్‌ఆర్‌కు సేవలు అందించినందుకు ధన్యవాదాలు చెప్పింది. ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు ద్రవిడ్ రాజస్థాన్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. అతడు ఒక సీజన్ వరకే హెడ్ కోచ్‌గా సేవలు అందించారు. ఇక రాజస్థాన్ కొత్త కోచ్ కోసం అన్వేషణ మొదలు పెట్టనుంది.
రాహుల్ ద్రవిడ్ 2024 టీ20 ప్రపంచకప్ వరకు టీమిండియాకు హెడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. టీమిండియా హెడ్ కోచ్‌గా స్వయంగా తప్పుకొన్న ద్రవిడ్.. అదే ఏడాది రాజస్తాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యారు. ఐపీఎల్ 2025లో ఆర్‌ఆర్‌కు సేవలు అందించారు. ద్రవిడ్ నాయకత్వంలో రాజస్థాన్ 2025 సీజన్‌లో ఎలాంటి ముద్ర వేయలేకపోయింది. 14 మ్యాచ్‌లలో 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. అయితే 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీని వెలుగులోకి తీసుకురావడానికి ద్రవిడ్‌ది కీలక పాత్ర ఉంది. కెప్టెన్ సంజూ శాంసన్, ద్రవిడ్ మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే సంజూ వేరే ఫ్రాంఛైజీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ద్రవిడ్ తప్పుకోవడం ఇక్కడ గమనార్హం.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
‘రాహుల్ ద్రవిడ్ తన హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగారు. రాజస్థాన్ రాయల్స్‌తో చాలా కాలం పాటు ప్రయాణించారు. ఆర్ఆర్ ఆటగాళ్లపై ఆయన ప్రభావం చాలా ఉంది. ఫ్రాంచైజీలో సంప్రదాయం నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. ఫ్రాంచైజీలో ఉన్నత స్థానం ఇస్తామని ఆఫర్ చేసినా.. తిరస్కరించారు. రాజస్థాన్ ఆటగాళ్లు, అభిమానుల నుంచి ద్రవిడ్‌కు ధన్యవాదాలు. ఆయన సేవలు ఎప్పటికీ మర్చిపోలేం’ అని ఆర్ఆర్ ట్వీట్ చేసింది. ఐపీఎల్ 2012, 2013 సీజన్లలో ద్రవిడ్ రాజస్తాన్ కెప్టెన్‌గా ఉన్నారు. ఐపీఎల్ రిటైర్మెంట్ అనంతరం రాజస్తాన్ ఫ్రాంఛైజీకి రెండేళ్లు మెంటార్‌నూ వ్యవహరించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..