IND vs AFG: ధర్మశాలలో గుర్బాజ్ సెంచరీతో విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్‌తో భారత్‌పై బద్దలైన రికార్డులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌తో ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టులో గుర్బాజ్ ఒక్కడే భారత బౌలర్లపై ఒంటరి పోరాటం చేస్తూ చెలరేగిపోయాడు. అతను కేవలం 48 బంతుల్లోనే శతక మార్క్‌ను అందుకొని వన్డే క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్‌గా గుర్బాజ్ సరికొత్త రికార్డును లిఖించాడు.
గతంలో మొహమ్మద్ షాజాద్ 72 బంతుల్లో చేసిన రికార్డును గుర్బాజ్ దాటేశాడు. కేవలం తన దేశ రికార్డులనే కాకుండా బలమైన టీమిండియాపై వన్డేల్లో రెండో అత్యంత వేగవంతమైన శతకం బాదిన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. గతంలో భారత్‌పై 45 బంతుల్లో షాహిద్ అఫ్రిది చేసిన సెంచరీ మొదటి స్థానంలో ఉండగా, జేమ్స్ ఫాల్క్‌నర్, ఏబీ డివిలియర్స్ (57 బంతులు) రికార్డులను గుర్బాజ్ అధిగమించాడు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఈ మ్యాచ్‌లో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన గుర్బాజ్, మొత్తం 51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు మరియు 200.00 స్ట్రైక్ రేట్‌తో సరిగ్గా 102 పరుగులు చేసి నితీష్ రెడ్డి బౌలింగ్‌లో అవుటయ్యాడు. మిగిలిన బ్యాటర్లలో కెప్టెన్ హష్మతుల్లా షాహిది 27 పరుగులు, అజ్మతుల్లా ఒమర్జాయ్ 26 పరుగులు చేయగా, భారత బౌలర్లలో హర్ష్ దూబే 3 వికెట్లు, అర్ష్‌దీప్ సింగ్ మరియు నితీష్ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు.
ఈ ఇన్నింగ్స్‌తో వన్డేల్లో హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మార్చే రికార్డులో 56.25 శాతంతో గుర్బాజ్ ప్రపంచంలోనే టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లాడు. ఈ విషయంలో అతను విరాట్ కోహ్లీ (41.22%), క్వింటన్ డికాక్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టడం విశేషం. భారత్‌పై ఒకే వన్డే ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 సిక్సర్లు బాదిన గుర్బాజ్, ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన తన సొంత రికార్డును మూడోసారి సమం చేశాడు.
అలాగే ఇరు జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ల చరిత్రలోనే ఇది అత్యంత వేగవంతమైన సెంచరీగా నిలిచింది. ధర్మశాల మైదానంలో కూడా ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. తన కెరీర్లో 9వ వన్డే సెంచరీని అత్యంత చిరస్మరణీయంగా మార్చుకుంటూ గుర్బాజ్ సృష్టించిన ఈ విధ్వంసం క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. ఇక.. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఆఫ్ఘనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ 3 వికెట్ల చొప్పున తీయగా.. నితీష్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్ తలా 2 వికెట్లు తీసి ఆఫ్ఘన్‌ను కట్టడి చేశారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!