Rahasya Gorak: కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ పై.. రహస్య గోరఖ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..!

Kiran Abhavaramthimmarajupalli Tv

Kiran Abhavaramthimmarajupalli Tv

టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం, తన నటనతోనే కాకుండా తన వ్యక్తిత్వంతోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ హీరో.. ఫలితాలతో సంబంధం లేకుండ బ్యాక్ టూ బ్యాక్, ఒక సినిమా సెట్లో ఉండగానే మరో చిత్రాన్ని లైన్లో పెడుతున్నాడు.  ఏడాది కనీసం రెండు చిత్రాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అలా హీరోగానే కాకుండా ఈ హీరో ‘క’ అనే పేరుతో ప్రొడక్షన్ కంపెనీ స్థాపించిన సంగతి తెలియదు. ఈ బ్యానర్ లాంచ్ చేస్తూ.. కొత్త వారికి అవకాశాలు ఇస్తూ కొత్త టాలెంట్‌ని ప్రొత్సహించడం దీని ఉద్దేశం అన్నాడు. చెప్పినట్టుగానే ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే సినిమాను ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ మూవీ ఈవెంట్ లో కిరణ్ భార్య రహస్య గోరఖ్.. తన వైవాహిక జీవితం, తన భర్త కిరణ్ అబ్బవరం గురించి చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read : Peddi: ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ అప్‌డేట్ వైరల్!

సాధారణంగా పెళ్లికి ముందు అమ్మాయిలకు కొన్ని కలలు, ఊహలు ఉంటాయి. రహస్య కూడా పెళ్లికి ముందు తన భర్త గురించి కొన్ని సరదా ఆలోచనలు ఉండేవని బయటపెట్టారు. “పెళ్ళయ్యాక తను కష్టపడి సంపాదిస్తాడు, నేను హాయిగా ఖర్చు పెడతాను అనుకున్నాను” అంటూ ఆమె చమత్కరించారు. అయితే పెళ్లి తర్వాత కిరణ్ వ్యక్తిత్వం చూసి ఆమె ఆశ్చర్యపోయారట. కిరణ్ అబ్బవరానికి ఎప్పుడూ తన చుట్టూ జనం ఉండాలని, సందడి సందడిగా ఉండాలని కోరుకుంటారట. ఒంటరిగా ఉండటం కంటే పది మందితో కలిసి సంతోషంగా గడపడమే ఆయనకు ఇష్టమని రహస్య చెప్పుకొచ్చారు. ఇలాంటి పార్ట్నర్ దొరకడం నిజంగా అదృష్టం, ఇలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరికీ ఉండాలి‘ అని ఆమె మనసులోని మాటను పంచుకున్నారు.