Ragi Kajjikayalu Recipe: న్యూట్రియంట్స్ పవర్ హౌస్.. పోషకాలు అందించే ‘రాగి కజ్జికాయలు’! చేసేయండి ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Kajjikayalu Recipe: ఆరోగ్యానికి ఉపయోగపడే సంప్రదాయ వంటకాలలో రాగి కజ్జికాయలు ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. నువ్వులు, పల్లీలు, శనగపప్పు, బెల్లం, రాగిపిండి వంటి పోషక పదార్థాలతో తయారయ్యే ఈ కజ్జికాయలు నిజంగా న్యూట్రియంట్స్ పవర్ హౌస్లా పనిచేస్తాయి. ఒక్క కజ్జికాయ తిన్నా రోజుకు శరీరానికి అవసరమయ్యే ఐరన్, కాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్ లో మంచి భాగం శరీరానికి అందుతుంది. ఇవి ఎముకల దృఢత్వాన్ని పెంచడంలో, రక్తహీనతను తగ్గించడంలో, గట్ హెల్త్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగడానికి కూడా ఈ ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుంది.
Also Read
- Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
- Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
- Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
- Kavya Maran - Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
తయారీ విధానం:
ముందుగా మిక్సీ జార్లో అర కప్పు వేయించిన నువ్వులు, అర కప్పు వేయించి పొట్టు తీసిన పల్లీలు, అర కప్పు వేపుడు శనగపప్పు వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టి ఈ మిశ్రమంలో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, రెండు కప్పుల బెల్లం తురుము వేసి తక్కువ మంటపై సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి. బెల్లం కరిగి ముద్దలా మారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలపాలి. ఆ తరువాత నెయ్యిలో వేయించిన జీడిపప్పు ముక్కలు, గసగసాలు వేసి మిశ్రమాన్ని పక్కన పెట్టాలి.
స్లిమ్ బెజెల్స్, టూ-వే స్పీకర్లతో రాబోతున్న Xiaomi X Pro QLED (2026) 75 అంగుళాల టీవీ.. ఫీచర్స్ ఇవే!
ఆ తర్వాత ఇంకో కడాయిలో ఒక కప్పు నీళ్లు, కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ బెల్లం, కొద్దిగా నెయ్యి వేసి మరిగించాలి. ఒక ఇప్పుడు కప్పు రాగి పిండి వేసి రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ముద్దగా చేసి చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ప్రతి ఉండలో ముందుగా తయారుచేసిన కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి ‘కజ్జికాయ’ ఆకారంలో ఒత్తుకోవాలి. చివరిగా ఈ కజ్జికాయలను ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరిపై సుమారు 15 నిమిషాలు ఉడికించాలి. చల్లారిన తర్వాత రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి కజ్జికాయలు సిద్ధం అవుతాయి. పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ సాంప్రదాయ స్వీట్ ను ఇంట్లోనే సులభంగా తయారు చేసి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
తాజావార్తలు
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
ట్రెండింగ్
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!