తిరుపతిలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పర్యటించారు. సోమవారం నామినేషన్ వేసిన ఆయన.. ఈరోజు తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ వేసి ఆనవాయితీ ప్రకారం శ్రీవారి ఆశీస్సులు కోసం వచ్చానన్నారు. చంద్రగిరి ప్రాంతాన్ని కొందరు చందనగిరిగా మార్చారని తెలిపారు. చంద్రగిరి అభివృద్ధి కోసం ప్రజలు టీడీపీ అభ్యర్థి నానిని గెలిపించాలని పేర్కొన్నారు. చంద్రబాబులానే భారీ మెజారిటీతో నాని చంద్రగిరి ప్రజలు గెలిపించాలని కోరారు.
KTR : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఎవరైనా లబ్ధిపొందారా…
జగన్ పై గులక రాయి దాడి పై అనేక అనుమానాలు ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు అన్నారు. బాలుడు విసిరిన రాయి దాడిలో సీఎంతో పాటు వెల్లంపల్లికి గాయ్యాలయ్యాయి.. బాలుడు దాడి చేసిన రాయి మాయమయ్యింది.. సినిమాను తలిపించేలా గులక రాయి దాడి డ్రామా జరిగిందని విమర్శించారు. వైసీపీ దారుణంగా ఓడిపోనున్నది.. ఎన్నికల్లో లబ్ది పొందెందుకే ఈ గులక రాయి డ్రామా అని అన్నారు. గోదావరి జిల్లాలో సీఎం పర్యటన సందర్బంగా భారీగా డబ్బులు ఖర్చు పెట్టినా.. ప్రజాదరణ కరువయ్యిందని ఆరోపించారు. గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, అనకాపల్లి జిల్లాలో సీఎం బస్సు పర్యటన ఆటర్ ప్లాప్ అయ్యిందని తెలిపారు.
Nallamilli Ramakrishna Reddy: కాషాయ తీర్థం పుచ్చుకున్న రామకృష్ణారెడ్డి
అధికారంలోకి రాబోయేది ఎన్డీఏ కూటమేనని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కూటమి భారీ విజయం సాధించి.. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చెయ్యాలని శ్రీవారిని ప్రార్థిస్తానని అన్నారు. కొత్తగా తెచ్చిన ల్యాండ్ యాక్ట్ ద్వారా ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.. ప్రజల ఆస్థిని కాపాడాల్సిన వారే ప్రజా భక్షకులుగా మారారన్నారు. తన పై రాజద్రోహం కేసు పెట్టి.. తనను చంపేందేకు ప్రయత్నించారని తెలిపారు. శ్రీవారి దయతో బయటపడ్డాను.. జగన్ ఓటమే తన లక్ష్యమని.. అతని ఓడించే వరకు తన పోరాటాన్ని ఆపనని పేర్కొ్న్నారు.