Site icon NTV Telugu

Raghu Kunche : రఘు కుంచె ఎమోషనల్ పోస్ట్

Raghu Kunche

Raghu Kunche

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రఘు కుంచె. ఇటీవల ఆయన ఇంట్లో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రఘు కుంచె తండ్రి లక్ష్మీనారాయణరావు మంగళవారం కన్నుమూశారు. ఆయనకు భార్య వరహాలమ్మ, కుమారుడు రఘు కుంచె, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో రఘు కుంచె తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశారు. తాగునీటి సంఘం అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణరావు పనిచేశారు. హోమియోపతిగా కూడా ప్రజలకు సేవలందించారు. అయితే తండ్రి అంత్య‌క్రియ‌ల‌ను పూర్తి చేసిన రఘు కుంచె.. ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

Also Read : Cane Toad: వామ్మో.. ఇది విన్నారా.. ఆ కప్ప బరువు ఏకంగా 2.7కిలోలంట

తన తండ్రి మరణంపై రఘు కుంచె శుక్రవారం తన సోషల్ మీడియాలో ఎమోషనల్‌గా.. “మా నాన్నగారు కాలం చేయడానికి కొన్ని గంటల ముందు, నేను తెచ్చిన కొత్త బట్టలు వేసుకుని, కుటుంబంతో సరదాగా గడిపారు. దూరంగా ఉన్నవారిని వీడియో కాల్‌లో పలకరించి, మరుసటి రోజు పొద్దున్నే లేచి, స్నానం చేసి, పూజలు చేసి, అల్పాహారం చేసి, తనకిష్టమైన మడత కుర్చీలో ఆనుకుని, జీవనాధారమైన భగవద్గీతను చదివి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. రోజూ ఎవరినీ బాధపెట్టని డాడీ.. చివరి క్షణాల్లో కూడా అలాగే వెళ్లిపోయారు… ఐ మిస్ యూ నాన్న” అంటూ రఘు కుంచె తన భావోద్వేగాలను వ్యక్తం చేశారు. తన తండ్రితో కలిసి కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశాడు.

Also Read : Suhas : సుహాస్‌ ‘రైటర్‌ పద్మభూషణ్‌’ ట్రైలర్‌ రిలీజ్‌..

Exit mobile version