NTV Telugu Site icon

Raghav chadha: రాఘవ్ చద్దాపై తప్పుడు కథనం.. యూట్యూబ్ ఛానెల్‌పై ఎఫ్‌ఐఆర్

E

E

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దాపై తప్పుడు కథనం ప్రచారం చేసిన ఓ యూట్యూబ్ ఛానల్‌పై కేసు నమోదైంది. రాఘవ్ చద్దాను పరారీలో ఉన్న విజయ్ మాల్యాతో పోల్చుతూ పంజాబ్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్‌లో ఓ కథనం వెలువడింది. ఈ కథనం ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందంటూ లూథియానా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆప్ అభ్యర్థి కుమారుడి ఫిర్యాదు చేశారు. దీంతో యూబ్యూట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: Maa Oori Polimera 2 : అరుదైన ఘనత సాధించిన “పొలిమేర 2”..

తప్పుడు కథనాలు, ప్రకటనలు ప్రజాశాంతి, సామరస్యానికి హాని కలిగిస్తాయని ఆప్ ఫిర్యాదులో పేర్కొంది. మతం, కులం, జాతి మరియు కమ్యూనిటీ ప్రాతిపదికన దేశంలోని వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించే అవకాశం ఉందని వెల్లడించింది.

విజయ్ మాల్యా ప్రజాధనాన్ని తీసుకొని యూకేకు పారిపోయాడని.. అదేవిధంగా కంటి చికిత్స కోసమంటూ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా కూడా ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయాడని ఛానల్‌లో కథనం వేసింది. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. తప్పుడు కథనం ప్రసారం చేసినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆప్ కోరింది. దీంతో యూబ్యూబ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Kakarla Suresh: ఒక్క అవకాశం ఇవ్వండి ఉదయగిరి నియోజకవర్గ తలరాత మారుస్తా..!

ఇదిలా ఉంటే మార్చి 21న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. కానీ ఇప్పటి వరకు రాఘవ్ చద్దా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. అరెస్ట్ భయంతోనే ఆయన పారిపోయారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆయన స్పందించలేదు. పైగా ఓ వైపు దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఆయన మాత్రం అడ్రస్ లేరు. మరోవైపు గుజరాత్ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కూడా ఆయన పేరు ఉంది. అయినా ఆయన ఎక్కడా కనిపించలేదు.

ఇది కూడా చదవండి: Ruhani Sharma: చూపులతో మాయ చేస్తున్న రుహాణి శర్మ…