NTV Telugu Site icon

Congress: రాయ్‌బరేలీ అభ్యర్థి ఖరారు.. ఏ క్షణంలోనైనా ప్రకటన!

Soni=ay

Soni=ay

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మూడో విడత మే 7న జరగనుంది. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. కానీ కాంగ్రెస్ మాత్రం రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఈ రెండు స్థానాలు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటివి.. అలాంటిది ఇప్పటి వరకూ ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఇదిలా ఉంటే శనివారం జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో.. ఆ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసే బాధ్యతను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించింది. ఇదిలా ఉంటే రాయ్‌బరేలీ ఎన్నికల నిర్వహణ కోసం 24 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది.

ఇది కూడా చదవండి: Delhi : ఢిల్లీలో 20 రోజుల పాటు మూతపడనున్న ఫ్లై ఓవర్.. కారణం ఇదే !

ఇదిలా ఉంటే ఈసారి సోనియాగాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. దీంతో రాయ్‌బరేలీ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ప్రియాంకనే రంగంలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఏ క్షణంలోనైనా ప్రియాంక పేరు ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. రాయ్‌బరేలీ అభ్యర్థిని స్వయంగా ప్రకటిస్తారని సమాచారం. అలాగే అమేథీ సీటును కూడా ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అమేథీ నుంచి రాహులే పోటీ చేస్తారా? లేదంటే ఇంకెవరైనా? పోటీ చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Delhi High Court: ఆరేళ్ల పాటు ప్రధాని మోడీ పోటీ చేయకుండా నిషేధించాలి..

సోనియా ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆరోగ్యరీత్యా ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో మాత్రం సోనియా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల పేర్లను ఇటీవలే కాంగ్రెస్ ప్రకటించింది. ఇందులో సోనియా గాంధీ పేరు ఉంది.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. తర్వాత మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి. అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Mahesh : ప్రేమంటే ఇదేరా.. మహేష్ తో మంజుల క్యాండిడ్ వీడియో వైరల్