Raashii Khanna: పోలీస్ ఆఫీసర్గా రాశీ ఖన్నా.. ‘లుఖ్కే’ వెబ్ సిరీస్ క్రేజీ అప్డేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా ఇప్పుడు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా తన ప్రతాపం చూపించడానికి సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘లుఖ్కే’ మే 8న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. హిమాంక్ గౌర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్, పంజాబ్ బ్యాక్డ్రాప్లో డ్రగ్స్ మాఫియాను కట్టడి చేసే ఒక ఇంటెన్స్ పోలీస్ డ్రామాగా రూపొందింది. ఈ సిరీస్లో రాశీ ఖన్నాతో పాటు పాలక్ తివారీ కూడా ఒక కీలక పాత్రలో మెరవబోతోంది.
అయితే ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో రాశీ తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.. ‘ఈ సిరీస్లో నేను ‘గుర్బానీ’ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తా. ఇప్పటికి ఎన్నో భాషల్లో సినిమాలు చేసినప్పటికీ, పంజాబీ నా అస్తిత్వం, ఈ పాత్ర కూడా పంజాబీ మూలాలు ఉన్నది కావడంతో నాకు ఇది చాలా ప్రత్యేకమైంది. గుర్బానీ పాత్రలో నటించడం నా సొంత ఇంటికి తిరిగి వచ్చిన అనుభూతిని ఇచ్చింది’ అని రాశీ ఎమోషనల్ అయ్యింది.
Also Read
కథలో గుర్బానీ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, ఆ పాత్రలో ఎన్నో ఎమోషన్స్, భిన్నమైన కోణాలు దాగి ఉంటాయని రాశీ వివరించింది. పూర్తి భిన్నమైన కథాంశంతో రూపొందిన ‘లుఖ్కే’లో భాగం కావడం తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే ఈ ఉత్కంఠభరితమైన పోరాటాన్ని చూడాలంటే మే 8 వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..