NTV Telugu Site icon

R Krishnaiah: బీసీలను ఓటు వేసే యంత్రాల్లా చూస్తున్నారు.. తప్ప సీట్లు ఇవ్వడం లేదు..

R Krishnaiah

R Krishnaiah

పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు తగినన్ని సీట్లు ఇవ్వకుండా అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయన్నారు. ఇప్పుడైనా బీసీలకు ఎమ్మెల్సీ సీట్లు కేటాయించి న్యాయం చేయాలని కోరారు. బీసీలు కూడా ఆర్థికంగా బలంగా ఉన్నారని.. బీసీ ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి ఒత్తిడి వస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని కులలాలకు జనాభా ప్రాతిపదికన అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలు ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారు.. తప్ప సీట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు ఎవరు సీట్లు ఇస్తే వారినే బీసీ పట్టభద్రులు, ఉపాధ్యాయులు గెలిపించుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

READ MORE: Komati Reddy Venkat Reddy: ఆర్‌&బీ అధికారులపై మంత్రి ఆగ్రహం.. రోడ్ల రిపేర్లు చేపట్టాలని ఆదేశం

బీసీలకు సీట్లు ఇవ్వని పార్టీలను బొంద పెడతామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామని గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు.

Show comments