NTV Telugu Site icon

R Ashwin: ఎంఎస్ ధోనీ కంటే అతడే తెలివైన కెప్టెన్: అశ్విన్

R Ashwin

R Ashwin

R Ashwin Praises Rohit Sharma Captaincy: వరల్డ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, టీమిండియాకు అద్భుత విజయాలు అందించిన మాజీ సారథి విరాట్ కోహ్లీ కంటే.. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మనే బెస్ట్ అని వెటరన్ అఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంటున్నాడు. ముగ్గరిలో సారథిగా వ్యూహాత్మకంగా రోహిత్ వ్యవహరిస్తాడని యాష్ పేర్కొన్నాడు. హిట్‌మ్యాన్ జట్టు వాతావరణాన్ని ఎంతో తేలికగా ఉంచుతాడని, ఓ ఆటగాడికి 100 శాతం మద్దతు ఇస్తాడన్నాడు. గత రెండు దశాబ్దాలుగా ధోనీ, కోహ్లీ, రోహిత్‌లు భారత జట్టుకు సారథులుగా ఉన్నారు. ఈ ముగ్గురి కెప్టెన్సీలో అశ్విన్ ఆడాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్ అశ్విన్ మాట్లాడుతూ… ‘రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2-3 విషయాలు అద్భుతం. హిట్‌మ్యాన్ సారథ్యంలో జట్టు వాతావరణం చాలా బాగుంటుంది. వ్యూహాత్మకంగా రోహిత్ ఎంతో బలవంతుడు. ఈ విషయంలో ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ కూడా బలవంతులే కానీ.. రోహిత్ కాస్త ముందుంటాడు. ఏదైనా పెద్ద మ్యాచ్ లేదా సిరీస్ ఉంటే.. ఎనలిటిక్స్ టీమ్, కోచ్‌లతో కలిసి రోహిత్ ప్రణాళికలు రూపొందిస్తాడు. బ్యాటర్‌ బలహీనత ఏంటి, బౌలర్‌కు ఏ ప్లాన్ వర్కౌట్ అవుతుందని చర్చిస్తాడు. అదే అతని బలం. ప్లేయర్లకు 100 శాతం మద్దతుగా ఉంటాడు. నా కెరీర్‌ మొత్తం ఈ ముగ్గురు కెప్టెన్సీలోనే ఆడాను’ అని చెప్పాడు.

Also Read: 3500 Year Old Jar: 3500 ఏళ్ల నాటి కూజాను పగలగొట్టినా.. మ్యూజియంకు మళ్లీ ఆహ్యానించారు!

ఆర్ అశ్విన్ ఇప్పటివరకు భారత్ తరఫున 100 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. 2010లో అరంగేట్రం చేసిన యాష్.. టెస్ట్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఉన్నాడు. ఎంఎస్ ధోనీ 2007 నుంచి 2018 వరకు టీమిండియాకు నాయకత్వం వహించాడు. మూడు ఫార్మాట్లో కలిపి 332 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించగా.. 178 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. 2013 నుంచి 2022 వరకు విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ 213 మ్యాచ్‌ల్లో 135 విజయాలు అందుకుంది. 2022లో పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ భారత జట్టుకు 126 మ్యాచ్‌ల్లో 93 గెలిచింది.