ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ ముఖ్యమైన పాత్ర పోషించాడని భారత జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. బోలాండ్‌ను జట్టులో ఎంపిక చేయకపోయి ఉంటే.. భారత జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుని ఉండేదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 1-3 తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో భారత్ 295 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన పెర్త్ టెస్టులో.. ఆస్ట్రేలియా బోలాండ్‌ను ప్లేయింగ్ 11లో చేర్చలేదు. అయితే అడిలైడ్ టెస్టులో జోష్ హేజిల్‌వుడ్ గాయపడడంతో స్కాట్ బోలాండ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Read Also: UP: డబ్బుల విషయంలో తగాదా.. ఆటో డ్రైవర్‌పై యువతి దాడి.. వీడియో వైరల్
బ్రిస్బేన్ టెస్ట్‌లో బోలాండ్ మళ్లీ బెంచ్‌కు పరిమితం కాగా.. ఆ తర్వాత అతను మెల్‌బోర్న్, సిడ్నీ టెస్టుల్లో ఆడాడు. బోలాండ్ జట్టులో ఉండటం ఆస్ట్రేలియా జట్టు అదృష్టమని అశ్విన్ చెప్పాడు. బోలాండ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని ఐదు మ్యాచ్‌లలో మూడు మాత్రమే ఆడినప్పటికీ అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. బోలాండ్ చివరి రెండు టెస్టుల్లో 16 వికెట్లు పడగొట్టాడు.. దీంతో ఆస్ట్రేలియా సిరీస్‌ను గెలుచుకుంది. 2014-15 తర్వాత తొలిసారిగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించింది. గత నాలుగు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలను కోల్పోయిన కంగారూ జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సిరీస్ విజయంతో ఆస్ట్రేలియా WTC ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది.
Read Also: Ramesh Bidhuri: ‘‘జింక’’లా తిరుగుతోంది.. సీఎం అతిషీపై మరోసారి రమేష్ బిధురి కామెంట్స్..