ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ ముఖ్యమైన పాత్ర పోషించాడని భారత జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. బోలాండ్‌ను జట్టులో ఎంపిక చేయకపోయి ఉంటే.. భారత జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుని ఉండేదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.