Thummala Nageshwara Rao: ఏ నగరమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ వాతావరణం బాగుండాలి.. ఖమ్మంలో ఆ పరిస్థితి లేదని, తాను మంత్రివర్గం నుంచి తప్పుకున్నాక పరిస్థితులు మారాయని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుతో ఎన్టీవీ క్వశ్చన్ అవర్‌లో పాల్గొన్నారు. తాను పదవీ కాలంలో ఉన్నప్పుడు కేంద్రంతో మాట్లాడి మౌలిక వసతుల కల్పనకు ప్రయత్నించానని ఆయన తెలిపారు. ఐదేళ్లుగా తాను వదిలేసిన పనులన్నీ అక్కడే ఆగిపోయాయన్నారు. ఖమ్మం ఒక మిశ్రమ జిల్లా అని.. టీడీపీ, లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తులు కొనసాగినా, అనంతరం విభేదాలు వచ్చాయన్నారు. తాను ఖమ్మంలో టీఆర్‌ఎస్ జెండా పట్టినప్పుడు ఒక్కరే ఎంపీటీసీ అని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒక పక్కా, నేను ఒక పక్క నిలిచామన్నారు. ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచామన్నారు.
Also Read: D.K Shivakumar: తెలంగాణలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ పర్యటన..
2018లో నేను గెలిస్తే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందని లెఫ్ట్ పార్టీలు భయపడ్డాయని.. అందుకే మూడు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయానన్నారు. మంత్రి పదవుల విషయంలో కేసీఆర్ చెప్పింది, నేను చెప్పింది రెండూ సరైనవేనని తుమ్మల స్పష్టం చేశారు. కేసీఆర్, నేను ఇద్దరం మిత్రులమేనన్న తుమ్మల.. చంద్రబాబును సీఎం చేసినప్పుడు కేసీఆర్, తాను కలిసి పనిచేశామన్నారు. కేసీఆర్‌కు మంత్రి పదవి తానే అడిగానన్నారు. ప్రతిపక్షం ఓడిస్తే ఎలాంటి బాధలేదు, కానీ నన్ను ఓడించింది సొంతవారే కావడం బాధించిందన్నారు. కేసీఆర్‌కు, తనకు ఇప్పటికీ విభేధాలు లేవన్న ఆయన.. ఆయన ఇంట్లో వారెవరికైనా ఉందేమో తెలీదన్నారు.
Also Read: Minister Niranjan Reddy: దేశానికి దిక్సూచిలా తెలంగాణ పాలన, పథకాలు
ఖమ్మంలో వేసిన శిలాఫలకాలు చూస్తే తాను చేసిన అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందన్నారు. కేసీఆర్‌కు ఇరిగేషన్ మినిష్టర్ కావాలనే కోరిక ఉండేదన్నారు. స్నేహం స్నేహమే.. రాజకీయం రాజకీయమే అంటూ కేసీఆర్‌తో ఉన్న మితృత్వం గురించి చెప్పారు. కేసీఆర్ తన స్థాయిని తగ్గించుకుని మాట్లాడారని.. అందుకు ఆయన పక్కన ఉన్నవారే కారణమన్నారు. కేసీఆర్‌ను ఈ రోజుకు తప్పుపట్టనన్నారు. ప్రజాస్వామ్య భావజాలానికి దగ్గరగానే ఉంటానని.. నాకు ఉన్న ఆప్షన్ కాంగ్రెస్సే.. అందుకే ఈ పార్టీలో చేరానన్నారు. ప్రజల ఒత్తిడి వల్లే కాంగ్రెస్‌లో చేరానన్నారు. ఈ ఎన్నిక ప్రజలకే టెస్టింగ్ అంటూ ఆయన అన్నారు. 2014లో ఉన్న ఈక్వేషన్ ఏంటి? 2018లో ఉన్న ఈక్వేషన్ ఏంటి? అనేది ఆలోచించాలన్నారు.
Also Read: Revanth Reddy: ఎమ్మెల్యే రసమయికి రేవంత్ రెడ్డి చురకలు
టీడీపీ పార్టీని కాపాడేందుకే ఎన్టీఆర్‌తో విభేదించాల్సి వచ్చిందన్నారు. సీపీఎంతో కూడా పొత్తు ఉండాలని కోరుకున్నామన్నారు. పొంగులేటి తనకు డబ్బు ఏమీ ఇవ్వలేదని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కాళేశ్వరం నిర్మాణంలో తాను భాగస్వామిని కాదన్న ఆయన.. ఖమ్మంలో భక్త రామదాసును 8 నెలల్లో కట్టానని పేర్కొన్నారు. జనసేన ప్రభావం ఖమ్మం జిల్లాలో అంతగా ఉండదన్నారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన వారెవరూ సంతృప్తిగా లేరన్నారు తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలుకు అనుకూలంగానే ఉందని ఆయన స్పష్టం చేశారు.