ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కొనసాగుతునే ఉంది. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలో ఇప్పటి వరకు 26 వేల మందికి పైగా మరణించారు. గాజా- ఇజ్రాయేల్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఖతార్ ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీ మధ్యవర్త్వం వహిస్తున్నారు. గాజాలో కాల్పుల విరమణకు సానుకూల పరిష్కారంపై చర్చలు జరుపుతున్నారు. ఇక, వాషింగ్టన్ డీసీలోని అట్లాంటిక్ కౌన్సిల్లో ఖతార్ ప్రధాని మాట్లాడుతూ.. హమాస్ చేతిలో ఉన్న బందీలను విడిపించడంతో పాటు గాజాలో శాశ్వత కాల్పుల విరమణను నెలకొల్పడానికి చర్చలలో పురోగతి సాధించామన్నారు. ఆదివారం జరిగిన చర్చల్లో కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఒప్పకున్నట్లు సమాచారం.
Read Also: Sri Hanuman Chalisa: దిష్టి, శని ప్రభావ దోషాలు తొలగిపోవాలంటే నేడు హనుమాన్ చాలీసా ఒక్కసారైనా వినండి
ఇక, గాజాలో బందీలుగా ఉన్న 136 మందిని విడిచిపెట్టి యుద్ధానికి తాత్కాలిక ముగింపు పలకడంపై దృష్టి సారించిన ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి ఆదివారం ముఖ్యమైన సమావేశం జరిగింది. CIA చీఫ్ విలియం బర్న్స్, మొస్సాద్ చీఫ్ డేవిడ్ బర్నియా, షిన్ బెట్ చీఫ్ రోనెన్ బార్ మరియు ఈజిప్షియన్ ఇంటెలిజెన్స్ చీఫ్ అబ్బాస్ కమెల్ వంటి ప్రముఖులు కూడా క్లోజ్డ్ డోర్ చర్చల్లో పాల్గొన్నారు. అయితే, అదే సమయంలో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ, బందీల విడుదలకు సంబంధించి కుదుర్చుకోవాల్సిన ఒప్పందానికి సంబంధించి ఇంకా లోటుపాట్లు ఉన్నాయని తెలిపింది. ఈ వారంలో మళ్లీ చర్చలు మరోసారి కొనసాగుతాయని తెలిపింది. ఈ యుద్ధానికి ముగింపు పలికాలని ప్రపంచం మొత్తం చూస్తుందని ఇజ్రాయేల్ ప్రధాని నేతన్యాహూ అన్నారు.
Read Also: Republic Day Parade: గణతంత్ర దినోత్సవ పరేడ్.. ఏపీ విద్యాశాఖ శకటానికి తృతీయ బహుమతి
అయితే, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించి బందీలను విడుదల చేయడానికి షరతుగా అన్ని IDF దళాలను ఉపసంహరించుకోవాలని హమాస్ డిమాండ్ చేసింది. అయితే, దానికి ఇజ్రాయెల్ ఈ డిమాండ్లను తిరస్కరించింది.. గాజా స్ట్రిప్‌పై దురాక్రమణను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ చేసుకున్న ఒప్పందంపైనే పారిస్ సమావేశం విజయవంతం అయిందని హమాస్ సీనియర్ అధికారి సమీ అబు జుహ్రీ తెలిపారు. ఈ షరతులకు ఒకే చెబితే.. హమాస్ 132 మంది బందీలలో అందరినీ విడిచిపెడుతుందా లేదా కొందరిని విడిచిపెడుతుందా అనేది వెంటనే స్పష్టంగా తెలియలేదు.