Site icon NTV Telugu

PVP Satirical Comments on Kesineni: కేశినేని నానిపై పీవీపీ సెటైర్లు.. బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే..!

Pvp

Pvp

PVP Satirical Comments on Kesineni: విజయవాడ ఎంపీ కేశినేని నాని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడమే మిగిలింది.. ఇప్పటికే తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఆ రాజీనామాకు ఆమోదం లభించగానే.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు.. ఇక, బుధవారం రోజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కలిసిన విషయం విదితమే.. అయితే, ఆది నుంచి కేశినేని నాని అంటే విరుచుకుపడే ప్రముఖ నిర్మాత, గత ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానంలో వైసీపీ తరఫున పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ).. తాజా పరిణామాలపై సెటైర్లు వేశారు. కేశినేని నానిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.. ”బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే.. వీడి బుద్ది గురించి బెజవాడంతా తెలుసుకదరా అబ్బాయ్” అంటూ X లో ట్వీట్ చేశారు పీవీపీ..

Read Also: Cyber Fraud: ప్రజాపాలన దరఖాస్తులో సైబర్‌ కేటుగాళ్లు.. కాల్‌ చేసి 10 వేలు కొట్టేశారు..

ఇక, ”చంద్రబాబు నాయుడు గారు పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన.. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తన్నాను.” అంటూ ఈ నెల 6వ తేదీన ఓ ట్వీట్‌ చేశారు కేశినేని నాని.. దీనిపై స్పందించిన పీవీపీ.. తన ట్వీట్‌ను కేశినేని నానికి ట్యాగ్‌ చేస్తూ.. ‘కేశినేని నాని పీపాల బస్తా, బెజవాడకే గుదిబండలా తయారయ్యావ్ నువ్వు.. ఏదో మచ్చ ఏసుకుని పుట్టావు, పార్టీ పుణ్యమా అని పదేళ్లు బండి కొనసాగించావు, బ్యాంకులను బాదావు, జనాలని, ఉద్యోగులని పీల్చి పిప్పి చేసావు.. ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి, అన్ని మూసుకుని మూలపడుండు పుండాకొర్!!” అంటూ ఘాటుగా ట్వీట్‌ చేశారు. ఇప్పుడు కేశినేని నాని వైసీపీలో చేరడం ఖాయమైన తర్వాత.. ”బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే.. వీడి బుద్ది గురించి బెజవాడంతా తెలుసుకదరా అబ్బాయ్” అంటూ కామెంట్‌ పెట్టారు పీవీపీ. అయితే, గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని తన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి అయిన పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)పై విజయం సాధించిన విషయం విదితమే. అప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తూ వచ్చింది.. కొంత కాలం తర్వాత ఇద్దరూ సైలెంట్‌ అయినా.. తాజా పరిణామాలు మరోసారి సోషల్‌ మీడియా వేదికగా సెటైర్లకు దారి తీసింది.

పీవీపీ తాజా ట్వీట్:

Exit mobile version