Site icon NTV Telugu

PV Narasimha Rao : సిడ్నీలో భారత మాజీ ప్రధాని విగ్రహం.. కేసీఆర్‌పై ప్రశంసలు

Pvr Statue At Sydney

Pvr Statue At Sydney

సిడ్నీలోని హోమ్‌బుష్ పార్క్‌లో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని శనివారం ఆవిష్కరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మార్గదర్శకత్వంలో మంజూరు చేయబడి, స్థాపించబడిన ఈ విగ్రహాన్ని నరసింహారావు కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్యే వాణీదేవి సమక్షంలో స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్ మాథ్యూ బ్లాక్‌మోర్ ఆవిష్కరించారు. ఈ కార్య్రమంలో టీఆర్‌ఎస్‌(BRS) ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్‌, స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిలర్ సంధ్యా రెడ్డి ఉన్నారు. అయితే.. నరసింహారావు జయంతి శతజయంతి వేడుకల్లో భాగంగా సిడ్నీలో మాజీ ప్రధాని విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని ఆస్ట్రేలియాలోని తెలుగువారు అన్నారు. భారతదేశంలోనే కాదు, విదేశాలలో కూడా పీవీఎన్‌ఆర్‌ గొప్పతనం గురించే తెలిసేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో సీఎం కేసీఆర్‌ను ఆస్ట్రేలియాలోని తెలుగువారు అభినందిస్తున్నారు.
Also Read : Palvai Sravanthi : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెన్నుపోటు పొడుస్తున్నారని అర్ధం అయ్యింది

దశాబ్దాలుగా పార్టీకి సేవలందించిన నాయకుడిని కనీస గౌరవం ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైనప్పటికీ, పీవీఎన్ఆర్ వారసత్వం భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా కొనసాగేలా కేసీఆర్‌ చేశారని టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అన్నారు. చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయ రంగంలో తిరుగులేని నాయకుడిగా ఎదగాలని నాగేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మెల్బోర్న్, బ్రిస్బేన్, పెర్త్, అడిలైడ్ నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు సిడ్నీలో విగ్రహావిష్కరణకు హాజరయ్యారు. నరసింహారావు గురించి ఆయన భారతదేశ అభివృద్ధికి చేసిన కృషిని స్మరించుకోవడానికి స్ట్రాత్‌ఫీల్డ్ టౌన్ హాల్‌లో సమావేశం కూడా నిర్వహించారు.

Exit mobile version