Putin: డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించబోతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో ‘‘దోస్తీ’’ గురించి మాట్లాడుతూనే, యూరప్ దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్ దిగుమతులను పెంచడం గురించి ప్రధాని నరేంద్రమోడీతో చర్చిస్తానని పుతిన్ చెప్పారు. భారత్, చైనాతో సహా కీలక భాగస్వాములతో రష్యా ఆర్థిక సంబంధాలు మరింత పెంచుకోవాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. VTB ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్‌లో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Tesla: భారత్‌లో ‘‘టెస్లా’’కు అంత ఈజీ కాదు, షాక్ ఇస్తున్న అమ్మకాలు..
‘‘నేను, ప్రధాని మోడీ రాబోయే పర్యటనలో భారతీయ దిగుమతుల గురించి చర్చిస్తాము, గత మూడేళ్లలో భారత్, చైనా రెండింటితో ద్వైపాక్షిక వాణిజ్యం బాగా పెరిగింది’’ అని పుతిన్ పేర్కొన్నారు. ఇదే సమయంలో వెస్ట్రన్ దేశాలు పుతిన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. యూరోపియన్ దేశాలు దౌత్యాన్ని విడిచిపెట్టాయని ఆరోపించారు. ‘‘యూరప్ యుద్ధం చేయాలనునకుంటే, మేము సిద్ధంగా ఉన్నాము’’ అని ఆయన అన్నారు. యూరోపియన్లకు శాంతియుత ఎజెండా లేదని, వారు యుద్ధం వైపు ఉన్నారని మండిపడ్డారు.
ఇతరులపై ఒత్తిడి తీసుకురావడానికి తమ గుత్తాధిపత్య స్థానాన్ని ఉపయోగించే దేశాల వల్ల ప్రపంచం అల్లకల్లోలంగా ఉందని రష్యా అధ్యక్షుడు అన్నారు. పాశ్యాత్య దేశాలు తమకు పోటీ ఉండకూడదని అనుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. వారు విఫలమవుతూనే ఉంటారని, రష్యా తన జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా స్వతంత్ర ఆర్థిక మార్గాన్ని అనుసరిస్తుందని పుతిన్ పునరుద్ఘాటించారు. మా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, సార్వభౌమ ఆర్థిక విధానాన్ని అనుసరిస్తూనే ఉంటామని పుతిన్ స్పష్టం చేశారు.