Tesla: భారత్‌లో ‘‘టెస్లా’’కు అంత ఈజీ కాదు, షాక్ ఇస్తున్న అమ్మకాలు..
- భారత మార్కెట్‌లో తేలిపోతున్న టెస్లా..
- దారుణంగా ఉన్న టెస్లా కార్‌ల అమ్మకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tesla: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ‘టెస్లా’(Tesla) భారత్‌లో తన సత్తా చాటలేకపోతోంది. సగటు భారతీయులు ఈ కార్‌లను కొనేందుకు ముందుకు రావడం లేదనేది స్పష్టమవుతోంది. భారత మార్కెట్లో టెస్లాకు అంత ఈజీ కాదని గణాంకాలు చెబుతున్నాయి. 2025లో టెస్లా ఇండియాలోకి ప్రవేశించింది. తన మోడల్ Y(Model Y)ని విక్రయిస్తోంది. అయితే, వీటి అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయి.
Read Also: Rahul Gandhi: ‘‘కుక్క వివాదం’’.. రేణుకా చౌదరికి మద్దతుగా రాహుల్ అనుచిత వ్యాఖ్యలు..
Also Read
- Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
- Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
VAHAN పోర్టల్ డేటా ప్రకారం, సెప్టెంబర్ 2025లో డెలివరీలు ప్రారంభమైనప్పటికీ, ఇప్పటి వరకు కేవలం 157 యూనిట్లను మాత్రమే విక్రయించింది. నవంబర్ లో కేవలం 48 కార్లను మాత్రమే డెలివరీ చేసింది. BMW, మెర్సిడెస్ బెంజ్ వంటి ఇతర లగ్జరీ కార్ల తయారీదారులు నవంబర్ నెలలో 267, 69 ఈవీ కార్లను అమ్మాయి. ఈ సంఖ్య టెస్లా కన్నా అధికం. భారత మార్కెట్లో మోడల్ వై ధర రూ. 58.59 లక్షలు(ఎక్స్ షోరూం) ఉండటం కూడా టెస్లా అమ్మకాలు పడిపోవడానికి ఒక కారణం. మరోవైపు, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, వోల్వోలకు భారత్‌లో బలమైన కస్టమర్ బేస్ ఉంది.
సెప్టెంబర్ మధ్య నాటికి టెస్లా దాదాపుగా 600 బుకింగ్స్ పొందింది. అయితే, వీటిలో తక్కువ మాత్రమే సేల్ అయ్యాయి. లేటెస్ట్ మోడళ్లు అందుబాటులో లేకపోవడం, డెలివరీ టైమ్ ఎక్కువగా కావడం కూడా కారణాలుగా కనిపిస్తున్నాయి. మరోవైపు టాటా, మహీంద్రా, బీవైడీ వంటి కంపెనీలు తక్కువ ధరలకే ఎక్కువ ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్లలో ఈవీ కార్లను తీసుకురావడం కూడా టెస్లా వ్యాపారం దెబ్బతినడానికి కారణంగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తర భారత్‌లో భూకంపం.. ప్రకంపనలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా?
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!