Site icon NTV Telugu

Putin: అమెరికా ఇంధనాన్ని కొనుగోలు చేయొచ్చు, ఇండియా చేస్తే తప్పా.?

Putin

Putin

Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా పుతిన్ భారత్ పర్యటకు వచ్చారు. భారత్, రష్యాల మధ్య మరిన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశం కనిపిస్తోంది. రక్షణ, ఇంధన, వాణిజ్య రంగాల్లో పలు ఒప్పందాలపై చర్చలు జరుగుతాయి. ఇదిలా ఉంటే, ఇండియా టుడే పుతిన్‌తో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా వైఖరి, వెస్ట్రన్ దేశాల నైజాన్ని ఎండగట్టారు.

Read Also: Realme Watch 5: 1.97-అంగుళాల AMOLED డిస్ప్లే, 16 రోజుల బ్యాటరీ లైఫ్ తో.. రియల్‌మీ వాచ్ 5 రిలీజ్

అమెరికా, రష్యా నుంచి అణు ఇంధనం కొనుగోలు చేయగలిగితే, భారత్ చమురు కొంటే తప్పేంటని ప్రశ్నించారు. అమెరికా తన సొంత విద్యుత్ ప్లాంట్ల కోసం రష్యా నుంచి అణు ఇంధనాన్ని కొనుగోలు చేస్తోందని, యూఎస్ రియాక్టర్ల కోసం యురేనియం కొంటుందని ఆయన అన్నారు. భారతదేశానికి కూడా అదే హక్కు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. అధ్యక్షుడు ట్రంప్‌తో సహా రష్యా దాని గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఉక్రెయిన్‌లో శాంతిని తీసుకురావడానికి ట్రంప్ నిజాయితీగా ప్రయత్నిస్తున్నారని ప్రశంసించారు. దీంట్లో రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయని అన్నారు.

భారత్, రష్యా సంబంధాలు ఎప్పుడూ కూడా ఇతరులకు హాని చేయలేదని పుతిన్ చెప్పారు. తనపై లేదా ప్రధాని మోడీపై ఒత్తిడి ఉన్నప్పటికీ , ఎవరికి వ్యతిరేకంగా తమ సహకారాన్ని ఉపయోగించలేదని పుతిన్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సొంత ఎజెండా ఉందని, కానీ వారి వ్యవహారాలు భారత్, రష్యా ఇతరులకు హాని కలిగించవని వెల్లడించారు. భారత్, రష్యా వాణిజ్యం గురించి మట్లాడుతూ.. మొత్తం వాణిజ్యం స్థిరంగా ఉందని, రష్యన్ చమురు కంపెనీలు భారత్‌ను నమ్మదగిన కస్టమర్‌గా భావిస్తున్నాయని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముందే రష్యా వ్యాపార సంస్థలు భారతదేశంతో దృఢమైన ఇంధన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకున్నట్లు చెప్పారు. భారత స్వాతంత్య్రం తర్వాత, సాధించిన అభివృద్ధిని ‘‘దాదాపు ఒక అద్భుతం’’ అని పుతిన్ ప్రశంసించారు. మోడీ ఒత్తిడికి లొంగిపోయే వ్యక్తి కాదని, భారత్ తన దృఢమైన వైఖరిని ప్రపంచానికి చూపించిందని అన్నారు.

Exit mobile version