Pushpa 2 : పుష్ప 2 ఈవెంట్… ఆయన మాత్రం రావట్లేదట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ ట్రైలర్ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో లాంచ్ కానుంది. ఇందుకోసం నగరంలోని చారిత్రాత్మక గాంధీ మైదాన్‌లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇటీవల, అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఈ చిత్రం ట్రైలర్‌ను పాట్నాలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఈవెంట్ కోసం అల్లు అర్జున్, రష్మిక పాట్నాకు రానున్నారు. గాంధీ మైదాన్‌లో సాయంత్రం 6:03 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. పుష్పా ఫ్రాంచైజీ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also:Jyothika : కంగువ నెగిటివ్ రివ్యూస్ పై జ్యోతిక వార్నింగ్ పోస్ట్
Also Read
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
అందుకే ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరవుతారని భావిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం గాంధీ మైదాన్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గాంధీ మైదాన్‌లోని గేట్ నంబర్ 10 నుండి అభిమానులు ఎంట్రీ ఇస్తారు, అక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ప్రవేశానికి ఉచిత పాస్‌లు ఈరోజు అందజేశారు. సాధారణంగా ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై వంటి పెద్ద నగరాల్లో ఏదైనా పెద్ద సినిమా ట్రైలర్ లాంచ్ చేస్తారు. కానీ పుష్ప 2 ట్రైలర్‌ను పాట్నాలో లాంచ్ చేస్తున్నారు. ఇప్పటికి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాట్నాలో పుష్పరాజ్ సందడి హెవీ లౌడ్ గా ఉండబోతోందనే మాట వినిపిస్తోంది. నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్ నేపథ్యంలో మొదటి ప్రమోషనల్ ఈవెంట్ అక్కడే పెడుతున్నారు.
Read Also:Amit Shah: ఎన్నికల ర్యాలీలు రద్దు చేసుకున్న అమిత్ షా.. హఠాత్తుగా ఢిల్లీకి ప్రయాణం.. కారణం ఇదే?
ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అటెండ్ అవ్వబోతున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో పబ్లిక్ వచ్చే అవకాశం ఉందని స్థానిక పోలీసులు భావిస్తున్నారు. వారితో పాటు టెక్నీషియన్స్ కూడా రానున్నారు. అయితే డైరెక్టర్ సుకుమార్ మాత్రం పాట్నాలో జరగబోయే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కావడం లేదని తెలుస్తోంది. ఈ మూవీ పెండింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా చాలా ఉన్నాయంట. వాటిని పూర్తి చేయడం పై సుకుమార్ పూర్తిగా ఫోకస్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాట్నాలో జరగబోయే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లడం లేదని అనుకుంటున్నారు. వీటితో పాటు మిగిలిన ప్రమోషనల్ ఈవెంట్స్ లలో చాలా వాటికి సుకుమార్ హాజరుకాకపోవచ్చనే టాక్ నడుస్తోంది. ‘పుష్ప’ తరహాలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా రిలీజ్ కి ముందు సుకుమార్ కనిపించొచ్చని ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!