NTV Telugu Site icon

Pushpa 2 : అక్కడ ఇక్కడ ఒకే సారి తగ్గేదేలే.. అంటున్న అల్లు అర్జున్

Allu Arjun

Allu Arjun

Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప చిత్రం ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా ఈ చిత్రం రికార్డుల మోత మోగించింది. దాదాపు రూ.100కోట్లకు పైగా భారీ వసూళ్లు సాధించింది. పుష్ప గా అల్లు అర్జున్ నటన కెరీర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాతో భారీ అంచనాలు రేకెత్తించిన సుకుమార్ పుష్ప పార్ట్ 2 తో మరింత అంచనాలు పెట్టుకొనేలా చేశాడు. ఈ క్రమంలోనే పుష్ప సినిమా రష్యాలోనూ విడుదలకు ముస్తాబవుతోంది. పుష్ప ఈ నెల 8న రష్యాలో విడుదల కానుంది.

Read Also: ChandraMohan: 1000కి పైగా సినిమాలు చేశా.. 100కోట్లు పోగొట్టుకున్నా

మాస్కోలో ఈ నెల 1న, సెయింట్ పీటర్స్ బర్గ్ లో నేడు ప్రీమియర్స్ ప్రదర్శించారు. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, హీరోయిన్ రష్మిక మందన్న, దేవిశ్రీప్రసాద్ తదితరులు రష్యాలో ప్రీమియర్స్ కు హాజరయ్యారు. రష్యన్ భాషలో రూపొందించిన పుష్ప ట్రైలర్ ఆకట్టుకుంది. కాగా, తమకు రష్యాలో లభిస్తున్న ఆదరణ పుష్ప టీమ్ లో మరింత ఉత్సాహం నింపింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత వై రవిశంకర్ ఆసక్తికర అప్ డేట్ వెల్లడించారు. పుష్ప-2 చిత్రాన్ని భారత్ తో పాటు రష్యాలోనూ ఒకే తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. ప్రస్తుతానికి ఈ జాబితాలో రష్యాను చేర్చామని రవిశంకర్ వివరించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న పుష్ప-2 చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show comments