Puri – Sethupathi: గుమ్మడి కాయ కొట్టేశారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంత కాలం క్రితం ప్రారంభమైంది. అయితే తాజాగా సినిమా షూటింగ్ ముగిసిందని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా, సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నారు. బిచ్చగాళ్ల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బ్రహ్మాజీతో పాటు వీటీవీ గణేష్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేస్తారని అందరూ భావించారు. పూరీ మార్క్ మిస్ కాకుండా ఆయన అనుకున్నట్టుగానే త్వరగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా,
Also Read : Chaitanya Jonnalagadda: ఆ పాత్ర కోసం చీకట్లో ప్రాక్టీస్ చేశా..
Also Read
- How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Vaibhav Sooryavanshi: "ఇది నిరంకుశత్వం".. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది సినిమా యూనిట్. అందులో సినిమా షూటింగ్‌ని తాను ఎలా మిస్ అవుతున్నానో విజయ్ సేతుపతి చెబుతూ ఉండడం కనిపిస్తోంది. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాని పూరీ జగన్నాథ్‌తో పాటు చార్మీ కౌర్, జేబీ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిజానికి, పూరీ జగన్నాథ్‌కు సాలిడ్ హిట్ దొరికి చాలాకాలం అవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన కంబ్యాక్ కోసం ఆయన అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబో అనగానే అందరి దృష్టి ఒక్కసారిగా ఈ సినిమా మీద పడింది. ఇక ఇప్పుడు ఆ అంచనాలను ఏమాత్రం మిస్ కాకుండా ఉండేందుకు పూరీ అండ్ టీం కష్టపడుతోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు మేకర్స్.
And that’s a wrap for #PuriSethupathi 🎬
After months of an intense, emotional, and joyful journey on the sets, the team has completed the entire shooting process 💥
Get ready for some truly exciting updates soon ❤️🔥
A #PuriJagannadh film 🎬@Charmmeofficial Presents 🎥… pic.twitter.com/HAvLjhTNfX
— Puri Connects (@PuriConnects) November 24, 2025
తాజావార్తలు
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
-
Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!
-
Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!