ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పర్యటించారు. జంగారెడ్డిగూడెం సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించడం లేదు అనేది అవాస్తవం.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులతో మాత్రమే.. నీళ్ళు తోడుకొడానికి ఉపయోగించుకోవాల్సిన పోలవరం ప్రాజెక్టును డబ్బు తోడుకునెందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుంటున్నాయని ఆమె ఆరోపించారు. పోలవరం నిర్మాణానికి ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.. త్వరలో వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకు పోలవరం లో పర్యటిస్తాం.. ఓటుతో సంబంధం లేకుండా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. ఆడుదాం ఆంధ్రా సంగతి ఎలా ఉన్నా.. ప్రజలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోంది అని పురంధేశ్వరి తెలిపారు.
Read Also: KTR: అప్పుల గురించి మాట్లాడతారు కానీ.. ఆస్తుల గురించి మాట్లడరా..?
పెట్టుబడులు పక్క రాష్ట్రాలు వాళ్ళు తీసుకుపోతున్నారు అంటూ ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడమే పనిగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది.. పార్లమెంట్ సాక్షిగా అమరావతి రాజధాని అని ప్రకటించింది.. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుంది.. ఒక్క ఏలూరు జిల్లాకే లక్ష ఇళ్ళు కేంద్రం కేటాయించింది.. జగనన్న కాలనీలు ఎలా ఉన్నాయో ప్రజలు చూస్తున్నారు అంటూ ఆయన ఆరోపించారు. 22 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది.. వీటిలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పూర్తి చేసింది అనేది శ్వేత పత్రం ఇవ్వాలి.. గ్రీన్ ఫీల్డ్ హైవే, ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పించాలి.. తొమ్మిదిన్నర ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందనేది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి పర్యటన కొనసాగిస్తున్నామని పురందేశ్వరి చెప్పారు.