Purandeswari: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. బీజేపీ కూడా పొత్తులపై క్లారిటీ ఇవ్వడంతో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ కూడా ఇప్పటి నుంచి ప్రచారంలో దూసుకుపోయేందుకు సిద్ధమైంది. బీజేపీ ప్రచార రథాలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రారంభించారు. మరోవైపు మేనిఫెస్టో రూపకల్పన కోసం అభిప్రాయ సేకరణ చేపట్టనుంది బీజేపీ. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఏం ఆశిస్తున్నారనే అంశంపై రెండు బాక్సులను ఏర్పాటు చేసింది. తొమ్మిది జిల్లాలకి మేనిఫెస్టో రథాలను బీజేపీ పంపుతోంది.
Read Also: TDP: త్వరలోనే టీడీపీ రెండో విడత అభ్యర్థుల జాబితా!
పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి వెల్లడించారు. టీడీపీ – జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడ్డం సంతోషమన్నారు. ఏ సీటు.. ఎన్ని సీట్లు అనేది ఒకట్రొండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ కోసమే పొత్తులు ఏర్పడ్డాయన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు అన్నింటినీ అర్థం చేసుకుంటారని ఆమె అభిప్రాయపడ్డారు. రాముల వారికి ఉడుత సాయం కూడా అవసరమైందన్నారు. ఏపీలో జరుగుతున్న అరాచకాల అంతానికి అందరూ కలవాల్సిన అవసరం ఉందన్నారు.
